మ‌హేష్‌తో అనీల్ రావిపూడి కాంబినేషన్..హిట్టా ఫ‌ట్టా

  • Publish Date - March 19, 2019 / 07:39 AM IST

అనీల్ రావిపూడి ర‌చ‌యిత‌గా కెరీర్ మొద‌లు పెట్టి ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారి వ‌రుస విజ‌యాలు సాధించాడు. ప‌టాస్‌తో తొలి హిట్ కొట్టిన అనీల్ ఆ త‌ర్వాత సుప్రీమ్ ,రాజా ది గ్రేట్ చిత్రాల‌తో అందరి దృష్టి ఆక‌ర్షించాడు. ఇటీవ‌ల ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో నాలుగో విజ‌యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అనీల్ రావిపూడి 5వ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి రానుంది. 
Read Also : ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ

బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న అనీల్ రావిపూడి రావిపూడి తన నెక్స్ట్ మూవీకి కథను రెడీ చేసుకోవడం.. ఆ కథను మహేష్‌కి వినిపించడం.. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకాచకా జరిగిపోయినట్టు వార్తలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్‌తో మూవీ క్యాన్సిల్ చేసుకున్న మహేష్.. హ్యాట్రిక్ హిట్స్ దర్శకుడు అనీల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు. ఈ సినిమాలో మహేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది.  ప్ర‌స్తుతం మ‌హేష్ త‌న 26వ సినిమాని మొద‌లు పెట్ట‌నున్నాడు.  ర‌ష్మిక మంథాన‌, అదితి రావు హైద‌రి ఈ సినిమాలో క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.