Anil Ravipudi multi-starrer film with Venkatesh-Kalyan Ram
Anil Ravipudi; మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రీజనల్ సినిమాల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో, వరుసగా తొమ్మిదవ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ నేపధ్యంలోనే దర్శకుడి నెక్స్ట్ సినిమాపై ఆసక్తినెలకొంది.
Virosh Wedding: పెళ్లి బంధంతో ఒకటైన విజయ్- రష్మిక.. ఫోటోలు షేర్ చేసిన కొత్త జంట
ఏ హీరోతో చేస్తాడు? ఎలాంటి కంటెంట్ తో వస్తాడు? అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వాళ్ళ ఎదురుచూపులకి ఎండ్ కార్డు వేస్తూ తన నెక్స్ట్ సినిమాపై అధికారిక ప్రకటన చేశాడు అనిల్ రావిపూడి. ఈ ప్రాజెక్టు కోసం మరోసారి ఇద్దరు స్టార్స్ ను కలుపుతున్నాడు అనిల్ రావిపూడి. ఆ స్టార్స్ మరెవరో కాదు తనకు ఫస్ట్ వంద కోట్ల సినిమా ఇచ్చిన విక్టరీ వెంకటేష్, తనకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్. ఈ ఇద్దరు హీరోలతో క్రేజీ మల్టీ స్టారర్ మూవీని తీసుకురాబోతున్నారు అనిల్ రావిపూడి.
ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఈసారి కూడా సినిమాను పండగ బరిలోనే దించనున్నాడు. ఈ విషయాన్ని కూడా వీడియోలో మెన్షన్ చేశాడు. కాబట్టి, 2027 సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ట్ చేయడానికి సిద్ధం అయ్యాడు అనిల్ రావిపూడి. ఇక ఈ న్యూస్ తెలిసిన చాలా మంది నెటిజన్స్.. అసలు ఈ కాంబినేషన్ అసలు ఊహించలేదు. వెంకటేష్- కళ్యాణ్ రామ్ క్రేజీ కాంబో. అలాగే, సంక్రాంతి- అనిల్ రావిపూడి కూడా సూపర్ కాంబో. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది.
మొదటి “వందకోట్ల బొమ్మ” కొట్టిన హీరో.. Victory @VenkyMama గారితో🔥
“మొదటిసారి బొమ్మ” తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి 💥
2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం 😍😍😍#VenkyAnil5 #NKRxAR pic.twitter.com/WRVWdbQpbz
— Anil Ravipudi (@AnilRavipudi) February 26, 2026