NBK 111 : బాలయ్య మూవీలో కాజల్ అగర్వాల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది
బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో (NBK 111) కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
Kajal Aggarwal first look from NBK111 movie
NBK 111 : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఓ చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్య కెరీర్లో 111వ చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. వీర సింహారెడ్డి తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ చిత్రంలో భాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నేడు (జూన్ 19 శుక్రవారం) కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. కళ్లద్దాలు పెట్టుకుని కాజల్ చాలా సీరియస్ చూస్తూ ఉన్న ఈ పోస్టర్ అదిరిపోయింది.
Maa Inti Bangaram : సమంత మా ఇంటి బంగారం ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
Every storm has a reason 🔥
Team #NBK111 is delighted to present and wishes the ever versatile @MsKajalAggarwal a very Happy Birthday ❤️
Yet again, you will witness a side of her 💥#HBDKajalAggarwal
GOD OF MASSES #NandamuriBalaKrishna @heromanoj1 @megopichand @musicthaman… pic.twitter.com/1FX5rhIYR4— Vriddhi Cinemas (@vriddhicinemas) June 19, 2026
ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ.. పీరియాడికల్, ముంబై మాఫియా నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నగా తెలుస్తోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
