Venkatesh : వెంకటేష్ సినిమా నెక్ట్ టైటిల్ అదిరిందిగా.. మళ్ళీ సంక్రాంతి టార్గెట్..
గతంలో F2, F3 సినిమాలు అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబోలో వచ్చి మంచి విజయం సాధించాయి.
- Saketh U
- Published On : February 29, 2024 / 07:31 AM IST
Anil Ravipudi Venkatesh Up Coming Movie Interesting Title Registered
Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇటీవల తన 75వ సినిమా సైంధవ్(Saindhav) తో సంక్రాంతికి(Sankranti) వచ్చారు. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్ లతో సినిమాలు చేయాలి. మొదట అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమానే చేయబోతున్నట్టు, ఈ సారి కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో ఈ కాంబో రాబోతున్నట్టు సమాచారం.
గతంలో F2, F3 సినిమాలు అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో వచ్చి మంచి విజయం సాధించాయి. ఇప్పుడు రాబోయే సినిమాని వచ్చే సంక్రాంతికే తీసుకు రాబోతున్నారని టాలీవుడ్ లో టాక్ కూడా నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి వెంకటేష్ తో తీయబోయే సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారట.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ కి అవార్డు రావాలని కోరుకునేవాడ్ని.. పవన్ మాటలతో ఖుషి అవుతున్న బన్నీ ఫ్యాన్స్..
గతంలో వెంకటేష్ సంక్రాంతి అనే టైటిల్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వచ్చి హిట్ కొట్టారు. మొన్న సంక్రాంతికే మిస్ అయినా నెక్స్ట్ సంక్రాంతికే మాత్రం ‘సంక్రాంతికే వస్తున్నాం’ అంటూ గ్యారెంటీగా హిట్ కొట్టేలా ఉన్నారు. ఇక రాబోయే 2025 సంక్రాంతికి వెంకటేష్ తో పాటు చిరంజీవి విశ్వంభర, ప్రశాంత్ వర్మ ఒక సినిమా, నాగార్జున సినిమాలు కూడా ఉండబోతున్నాయి.
