Allu Arjun : అల్లు అర్జున్ కి అవార్డు రావాలని కోరుకునేవాడ్ని.. పవన్ మాటలతో ఖుషీ అవుతున్న బన్నీ ఫ్యాన్స్..

ఇటీవల అల్లు అర్జున్ పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే.

Allu Arjun : అల్లు అర్జున్ కి అవార్డు రావాలని కోరుకునేవాడ్ని.. పవన్ మాటలతో ఖుషీ అవుతున్న బన్నీ ఫ్యాన్స్..

Pawan Kalyan Comments on Allu Arjun in Public Meeting Comments goes Viral

Updated On : February 29, 2024 / 10:22 AM IST

Allu Arjun : పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉండటంతో ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. తాజాగా ఓ పబ్లిక్ పొలిటికల్ మీటింగ్ లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలతో పాటు సినిమాల గురించి, సినిమా హీరోల గురించి కూడా మాట్లాడారు.

పవన్ మాట్లాడుతూ.. నా సినిమా హిట్ అయితే ఒక వారమే నేనుంటాను. నెక్స్ట్ వారం ఇంకో హీరో వస్తాడు. బాలయ్య గారు, జూనియర్ ఎన్టీఆర్, బాహుబలి ప్రభాస్, మహేష్ బాబు.. ఇలా అందరి సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడ్ని. మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలనుకునేవాడ్ని. అల్లు అర్జున్, పుష్ప హీరో.. అద్భుతంగా ఉండాలని, గొప్ప అవార్డు సాధించాలని కోరుకున్నాను అని అన్నారు. దీంతో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Premalu : బాహుబలి ‘ప్రేమలు’.. ప్రేమ బాణాలు విసురుతున్న హీరో హీరోయిన్స్..

ఇటీవల అల్లు అర్జున్ పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. మొదటిసారి ఓ తెలుగు హీరో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు బన్నీ. అప్పుడే పవన్ సోషల్ మీడియా ద్వారా బన్నీకి అభినందనలు తెలిపారు. తాజాగా ఇలా పబ్లిక్ మీటింగ్ లో మరోసారి అల్లు అర్జున్ గురించి మాట్లాడటంతో బన్నీ అభిమానులు సంతోషిస్తూ ఈ వ్యాఖ్యలని వైరల్ చేస్తున్నారు.