IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. కీలక పాత్ర పోషించిన ఆ నలుగురు.. సూపర్-8కు దూసుకెళ్లిన టీమిండియా
IND vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం కొలంబో వేదికగా టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది.
IND vs PAK
- పాకిస్థాన్ జట్టుపై భారత్ ఘన విజయం
- 61 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా
- అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ఇషాన్ కిషన్
- పాక్ బ్యాటర్లను వెంటవెంటనే పెవిలియన్‌కు చేర్చిన భారత బౌలర్లు
IND vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం కొలంబో వేదికగా టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read : Ishan kishan : పాపం పాకిస్థాన్..! ఇషాన్ కిషన్ ఊచకోత.. యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర
తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ డకౌట్‌తో నిరాశపర్చినా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక భూమిక పోషించాడు. క్రీజులో వచ్చినప్పటి నుంచి బౌండరీల మోత మోగించిన ఇషాన్.. 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లలో సూర్యకుమార్ (32), శివమ్ దూబే (27) పర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాటర్లు భారీ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.
WHAT A RIPPER BY JASPRIT BUMRAH – THE GOAT IS HERE…!!! 😍 pic.twitter.com/e5H9UQBNgP
— Johns. (@CricCrazyJohns) February 15, 2026
176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టుకు ఆది నుంచి కష్టాలు ఎదురయ్యాయి. భారత బౌలర్లు జస్ర్పీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేశారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే పాకిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత పాకిస్థాన్ బ్యాటర్లను వెంటనే వెంటనే పెవిలియన్ పంపించడంలో భారత బౌలర్లు విజయవంతం అయ్యారు. దీంతో పాకిస్థాన్ జట్టు 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఉస్మాన్ ఖాన్ (44), షాహీన్ అఫ్రిది (23నాటౌట్), షాదాబ్ ఖాన్ (14) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.
THE WINNING MOMENT OF INDIA…!!!
It’s 16-1 in World Cups 🥶🔥 pic.twitter.com/K3MW75YLZd
— Johns. (@CricCrazyJohns) February 15, 2026
భారత జట్టు విజయంలో ఇషాన్ కిషన్ కీలక భూమిక పోషించాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో పరుగుల వరద పారించాడు. మరోవైపు బౌలర్లుసైతం అద్భుతంగా బౌలింగ్ చేయడతో పాకిస్థాన్ బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. ఆరంభంలోనే బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుత బంతులతో కీలక బ్యాటర్లను ఔట్ చేశారు. దీంతో బుమ్రా రెండు, హార్దిక్ రెండు, అక్షర్ పటేల్ రెండు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ నడ్డి విరగ్గొట్టారు. ఈ విజయంతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ పోటీల్లో పాకిస్థాన్ జట్టుపై భారత్ ఆధిక్యం 8-1కి చేరింది.
