Premalu : బాహుబలి ‘ప్రేమలు’.. ప్రేమ బాణాలు విసురుతున్న హీరో హీరోయిన్స్..
మలయాళంలో ఇటీవల సూపర్ హిట్ అయిన 'ప్రేమలు' సినిమాని తెలుగులోకి తీసుకురాబోతున్నారు.

Malayalam Super Hit Movie Premalu Releasing in Telugu by SS Karthikeya
Premalu : ఇటీవల తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మంచి మంచి ప్రేమ కథలు వస్తున్నాయి. ఈ ప్రేమ కథలు అక్కడ హిట్ అవ్వడంతో తెలుగులోకి కూడా డబ్బింగ్ చేసి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళంలో ఇటీవల సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ సినిమాని తెలుగులోకి తీసుకురాబోతున్నారు. నస్లెన్, మమిత బైజు.. పలువురు ముఖ్య పాత్రలతో గిరీష్ దర్శకత్వంలో, నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మాణంలో తెరకెక్కిన ప్రేమలు సినిమా ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది.
మలయాళంలో ప్రేమలు సినిమాని కేవలం 3 కోట్లతో తెరకెక్కించగా ఫిబ్రవరి 9న రిలీజయి ఏకంగా 50 కోట్ల వరకు కలెక్షన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్బింగ్ చేసి తీసుకువస్తున్నారు. శివరాత్రి సందర్భంగా మార్చ్ 8న ఈ సినిమా తెలుగులోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ని కార్తికేయ రిలీజ్ చేశారు.
Also Read : Racha Ravi : రచ్చ రవి డబుల్ మీనింగ్ డైలాగ్‌కి.. గట్టి కౌంటర్ ఇచ్చిన యాంకర్..
ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్స్ ని బాహుబలి పోజులో నిల్చోబెట్టి బాణాలు వదులుతున్నట్టు చూపించారు. ఆ బాణాల చివర్లో లవ్ సింబల్స్ పెట్టి ప్రేమ బాణాలుగా చూపించారు. ఈ పోస్టర్ కొత్తగా ఉండటంతో వైరల్ గా మారింది. మరి మలయాళంలో యూత్ ని మెప్పించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంతవరకు లభిస్తుందో చూడాలి.