Racha Ravi : రచ్చ రవి డబుల్ మీనింగ్ డైలాగ్‌కి.. గట్టి కౌంటర్ ఇచ్చిన యాంకర్..

‘ఓం భీమ్ బుష్’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రవి చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Racha Ravi : రచ్చ రవి డబుల్ మీనింగ్ డైలాగ్‌కి.. గట్టి కౌంటర్ ఇచ్చిన యాంకర్..

Anchor Geetha Bhagat fires on Racha Ravi at Om Bheem Bush Teaser launch event

Updated On : February 28, 2024 / 5:12 PM IST

Racha Ravi : ఈమధ్య టాలీవుడ్ మూవీ ఈవెంట్స్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్యకర మాటలు ఎక్కువ వినిపిస్తూ వస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా ‘ఓం భీమ్ బుష్’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రవి చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఈవెంట్ కి గీతా భగత్ యాంకర్ గా వ్యవహరించగా, స్టేజి పై రచ్చ రవి మాట్లాడుతూ.. డబుల్ మీనింగ్ డైలాగ్‌ వదిలారు. దానికి యాంకర్ కూడా కొంచెం సీరియస్ అవుతూ.. గట్టి కౌంటరే ఇచ్చారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, యాంకర్ గీతాతో రచ్చ రవి మాట్లాడుతూ.. “ఓం భీమ్ బుష్ నీది మాయం అయ్యింది” అంటూ కామెంట్ చేశారు. దానికి గీతా షాక్ అయ్యారు. అయితే మాటల్లో కొంచెం గ్యాప్ ఇచ్చిన రవి.. ‘నీ మనసు మాయమయ్యి నా దగ్గరకి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Bade Miyan Chote Miyan : కాపీ కొట్టేటప్పుడు చూసుకోవాలి కదా అబ్బా.. నాటు నాటు, కావాలి సాంగ్స్‌తో బాలీవుడ్ మిక్స్..

దీనికి గీతా రియాక్ట్ అవుతూ.. “నువ్వు గ్యాప్ ఇచ్చి మాట్లాడకు. ఓం భీమ్ బుష్ నీది మాయం అయ్యింది. నీ బుర్ర నీ నుంచి మాయం అయ్యింది” అంటూ స్టేజి పైనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రచ్చ రవిని విమర్శిస్తూ వస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఇక ‘ఓం భీమ్ బుష్’ మూవీ విషయానికి వస్తే.. సూపర్ హిట్ ట్రైయో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘బ్రోచేవారెవరురా’ సినిమా తరువాత మరోసారి కడుపుబ్బా నవ్వించడానికి ఈ ముగ్గురు సిద్ధమవుతున్నారు. ‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.