Bade Miyan Chote Miyan : కాపీ కొట్టేటప్పుడు చూసుకోవాలి కదా అబ్బా.. నాటు నాటు, కావాలి సాంగ్స్‌తో బాలీవుడ్ మిక్స్..
కాపీ కొట్టేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా. మరి బ్లాక్ బస్టర్స్ అయిన సాంగ్స్ నే కాపీ కొట్టేస్తే దొరికిపోక ఏమవుతారు.

Akshay Kumar Tiger Shroff Bade Miyan Chote Miyan Mast Malang Jhoom song
Bade Miyan Chote Miyan : బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా ఛోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు. సోనాక్షి సిన్హా, మనుషి చిల్లర, అలయా ఎఫ్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు. రంజాన్ కి రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు.
ఈక్రమంలోనే ఇప్పటికే మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాగా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మస్త్ మలంగ్ ఝుమ్’ అనే పాటని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో అక్షయ్ అండ్ టైగర్ కలిసి స్టెప్పులు వేశారు. అయితే ఆ స్టెప్పులు చూస్తుంటే ఆడియన్స్ కి మరో పాట గుర్తుకు వస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసి ఆస్కార్ ని కూడా దక్కించుకున్న ‘నాటు నాటు’ పాటలోని స్టెప్స్ ని ఈ పాట కోసం కాపీ కొట్టేసారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వేసిన ఐకానిక్ స్టెప్ ని కొద్దిగా అటుఇటుగా మార్చి ‘బాస్కో-సీసర్’ ఈ పాటకి కోరియోగ్రఫీ చేసేసారు. అక్షయ్ అండ్ టైగర్ కలిసి వేస్తున్న ఆ స్టెప్ చూస్తుంటే.. బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా చరణ్ అండ్ ఎన్టీఆర్ వేసిన నాటు నాటు స్టెప్పే గుర్తుకు వస్తుంది. అయితే ఈ పాటలో ఈ స్టెప్స్ మాత్రమే కాపీ కాదు, సాంగ్ ట్యూన్ కూడా కాపీనే అంటున్నారు నెటిజెన్స్.
Also read : Kaavaali Song : జైలర్ ‘కావాలా’ సాంగ్‌కి.. ఏనుగు డాన్స్.. కానీ ఓ ట్విస్ట్..
ఈ పాటని విశాల్ మిశ్ర కంపోజ్ చేశారు. అయితే ఈ ట్యూన్ వింటుంటే సౌత్ సూపర్ హిట్ సాంగ్ ‘కావాలి’ గుర్తుకు వస్తుంది. రజినీకాంత్ ‘జైలర్’లో తమన్నా డాన్స్ చేసిన ఈ పాట ఎంతటి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మస్త్ మలంగ్ ఝుమ్ ట్యూన్, కావాలి సాంగ్ ట్యూన్ వినడానికి కొంచెం ఒకేలా ఉంది. దీంతో ఈ రెండు విషయాలని చూపిస్తూ నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
కాపీ కొట్టేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా. మరి బ్లాక్ బస్టర్స్ అయిన సాంగ్స్ నే కాపీ కొట్టేస్తే దొరికిపోక ఏమవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్న ఆ సాంగ్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
What a clown??
Dance step copy from #NaatuNaatu(RRR)
Music copy from #Kaavaalaa(Jailer) #BadeMiyanChoteMiyan #BMCM#MastMalangJhoom #TigerShroff#AkshayKumar #ShahRukhKhan— WW lll⏳?☠️☢️ (@HeyyStopNow) February 28, 2024
Ayla same to same…??#BadeMiyanChoteMiyan #BMCM#MastMalangJhoom #TigerShroff#AkshayKumar #ShahRukhKhan #Rajinikanth #ThalapathyVijay pic.twitter.com/j096GBDTXw
— WW lll⏳?☠️☢️ (@HeyyStopNow) February 28, 2024