Kaavaali Song : జైలర్ ‘కావాలా’ సాంగ్‌కి.. ఏనుగు డాన్స్.. కానీ ఓ ట్విస్ట్..

జైలర్ ‘కావాలా’ సాంగ్‌కి ఓ ఏనుగు వేసిన డాన్స్ చూసారా..? వీడియో అయితే అదిరిపోయింది, కానీ ఓ ట్విస్ట్ ఉంది.

Kaavaali Song : జైలర్ ‘కావాలా’ సాంగ్‌కి.. ఏనుగు డాన్స్.. కానీ ఓ ట్విస్ట్..

elephant dance for Tamannaah bhatia Jailer Kaavaali Song

Updated On : February 28, 2024 / 3:58 PM IST

Kaavaali Song : సూపర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి విజయం సాధించిందో.. మూవీలో మిల్కి బ్యూటీ తమన్నా వేసిన ‘కావాలి’ సాంగ్ అంతటి క్రేజ్ ని సొంతం చేసుకుంది. అనిరుద్ ఇచ్చిన ఆ క్యాచీ ట్యూన్ కి జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేసిన స్టెప్పులు.. ప్రతి ఒక్కర్ని ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో రిలీజైన ఈ వీడియో సాంగ్ కి రికార్డు వ్యూస్ వచ్చాయి.

ఈ పాటకి ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ సైతం డాన్స్ వేయకుండా ఉండలేకపోయారు. అందుకే ఆ పాటకి రీల్స్ చేస్తూ సందడి చేశారు. సినిమా రిలీజ్ అయ్యి నెలలు గడిచిపోతున్నా.. ఎక్కడో చోట ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఆడియన్స్ లో ఈ పాటకి అంతటి క్రేజ్ లభించింది. తాజాగా ఈ పాటకి ఓ ఏనుగు డాన్స్ ఆడి అదుర్స్ అనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Also read : Taapsee Pannu : పెళ్లి పీటలు ఎక్కబోతున్న తాప్సీ.. ఆ నెలలో అక్కడే వివాహం..

ఆ వీడియో చూసిన ప్రతిఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ డాన్స్ వీడియోలో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అది నిజమైన ఏనుగు కాదు. ఏనుగు బొమ్మని ధరించి ఇద్దరు వ్యక్తులు అలా డాన్స్ వేశారు. అయితే అది చూడడానికి అసలు బొమ్మలా కనిపించడం లేదు. అంతలా బొమ్మని రెడీ చేశారు. అంతేకాదు, లోపల ఉండి డాన్స్ వేసిన వ్యక్తులు కూడా ఏనుగుకి తగ్గట్లు డాన్స్ వేసి వావ్ అనిపించారు. మరి వైరల్ అవుతున్న ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.