IND vs PAK : 19ఏళ్ల తర్వాత..! చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
ishan kishan : పాకిస్థాన్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ 27బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గత 19ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
ishan kishan
IND vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. అయితే, అభిషేక్ డకౌట్ రూపంలో మొదటి ఓవర్లోనే ఔట్ అయ్యాడు. దీంతో పాకిస్థాన్ ప్లేయర్లు సంబురాలు చేసుకున్నారు. అయితే, వారి సంబురాలు ఎక్కువసేపు నిలవలేదు. ఇషాన్ కిషన్ పాకిస్థాన్ బౌలర్లపై బ్యాటుతో విరుచుకుపడ్డాడు.
Also Read : Ishan kishan : పాపం పాకిస్థాన్..! ఇషాన్ కిషన్ ఊచకోత.. యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర
టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2027 ఫైనల్ తరువాత పాకిస్థాన్ జట్టుపై హాఫ్ సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ చరిత్రకెక్కాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
ISHAN KISHAN HAMMERING PAKISTAN BOWLERS LEFT, RIGHT, CENTER…!!! 🥶 pic.twitter.com/ckCAZkZPsK
— Johns. (@CricCrazyJohns) February 15, 2026
పాకిస్థాన్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ 27బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గత 19ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. గత 19ఏళ్లలో ఏ భారత ఓపెనర్ కూడా పాకిస్థాన్‌పై టీ20 ప్రపంచ కప్‌లో హాఫ్ సెంచరీ సాధించలేదు. చివరి సారిగా 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ ఓపెనర్‌గా వచ్చి పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ భారత ఓపెనర్ హాఫ్ సెంచరీ సాధించలేదు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగినా పాకిస్థాన్ జట్టుపై 50 పరుగులు చేయలేక పోయారు. తాజాగా.. ఆ ఘనతను ఇషాన్ కిషన్ సాధించాడు.
