R Praggnanandhaa : ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనత.. సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీ విజేతగా
భారత గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద (R Praggnanandhaa )మరో అరుదైన ఘనత సాధించాడు.
R Praggnanandhaa Seals Grand Chess Tour St Louid Rapid And Blitz Title
R Praggnanandhaa : భారత గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలో జరిగిన సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీ విజేతగా నిలిచాడు. 20 ఏళ్ల ప్రజ్ఞా మరొక రౌండ్ మిగిలి ఉండగానే గెలుపొందాడు. జవోఖిర్ సిందారోవ్తో మ్యాచ్ను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. ఈ క్రమంలో మొత్తం 35లో 23.5 పాయింట్లు సాధించాడు. మిగిలిన ఆటగాళ్ల కంటే 1.5 పాయింట్ల ఆధిక్యంలో ఉండడంతో టైటిల్ ఖాయమైంది.
ఈ విషయాన్ని భారత చెస్ తన సోషల్ మీడియాలో ఖతాలో వెల్లడించింది. భారత చెస్ అభిమానులకు శుభవార్త. ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ విజేతగా నిలిచాడు. ఇది అతడికి తొలి రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్, కంగ్రాట్స్ ప్రజ్ఞానంద అని పోస్ట్ చేసింది.
Ishan Kishan : సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు?
Its 2:16 AM in India right now, and we have huge news coming in from the USA. R. Praggnanandhaa is the Champion of Grand Chess Tour St. Louis Rapid and Blitz with a round to spare!
Praggnanandhaa drew against Javokhir Sindarov in the penultimate round to seal the tournament win… pic.twitter.com/R3J0Y5UvZG
— ChessBase India (@ChessbaseIndia) August 6, 2026
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జూన్లో నార్వేలోని ఒస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో కూడా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకున్నారు. వరుసగా నాలుగు క్లాసికల్ విజయాలు నమోదు చేసి తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిళ్లలో ఒకదాన్ని గెలుచుకున్నారు.
