Ishan Kishan : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు?
వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan ) ఐపీఎల్ 2027 సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Ishan Kishan likely to captain Sunrisers Hyderabad in the IPL 2027 season
Ishan Kishan : ఐపీఎల్ 2027 సీజన్లో కొత్త సారథి నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్రస్తుత ఎస్ఆర్హెచ్ సారథి పాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేది అనుమానమేనని అంటున్నారు. ఈ క్రమంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2027 సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ భారీ అంతర్జాతీయ షెడ్యూల్, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఐపీఎల్ 2027కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కొత్త కెప్టెన్ ఎంపికపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు కమిన్స్ గాయంతో దూరమైన సమయంలో ఇషాన్ కిషన్ తాత్కాలిక సారథిగా జట్టును నడిపించాడు. అతడి నాయకత్వంలో జట్టు మంచి ప్రదర్శననే చేసింది. ఏడు మ్యాచ్‌ల్లో ఇషాన్ సారథ్యంలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ క్రమంలోనే ఇషాన్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అదే సమయంలో ఈ విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొందరపడడం లేదని, డిసెంబర్ నాటికి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
