నయనతార అంజలి సి.బి.ఐ. -ట్రైలర్

నయనతార అంజలి సిబిఐ -ట్రైలర్ రిలీజ్..

  • Publish Date - February 13, 2019 / 06:54 AM IST

నయనతార అంజలి సిబిఐ -ట్రైలర్ రిలీజ్..

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా, తమిళనాట హిట్ అయిన ఇమైక్క నొడిగల్ సినిమాని తెలుగులో అంజలి సి.బి.ఐ. పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చెయ్యగా, తమిళ యంగ్ హీరో అథర్వ, రాశీఖన్నా జంటగా కనిపించనున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించగా, నయనతార భర్త.. విక్రమాదిత్యగా, విజయ్ సేతుపతి స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేసారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన అంజలి సి.బి.ఐ. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

సైకో కిల్లర్ చేస్తున్న మర్డర్స్‌ని ఆపడానికి అంజలి పడే తాపత్రయం, విలన్, అంజలీ మధ్య మైండ్‌గేమ్, ఎత్తుకు పై ఎత్తులు, చాలెంజ్‌లు.. ఆడియన్స్‌కి క్యూరియాసిటీ కలిగించేలా ఉందీ ట్రైలర్.. గోపీనాథ్ ఆచంట సమర్పణలో, సి.హెచ్.రాంబాబు నిర్మిస్తున్న అంజలి సి.బి.ఐ. ఫిబ్రవరి 22న రిలీజవుతుంది. ఈ సినిమాకి మాటలు : శ్రీరామకృష్ణ, సంగీతం : హిప్ హాప్, కెమెరా : ఆర్.డి.రాజశేఖర్, ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్. 

వాచ్ ట్రైలర్…