Corona Vaccine: టీకా తీసుకుంటూ ఏడ్చేసిన న‌టి

ఇంజక్షన్ అంటే చాలామంది భయపడుతుంటారు. పిల్లలే కాదు.. పెద్దవారిలో కూడా ఈ భయం కనిపిస్తుంది. కొందరైతే కేకలు వేస్తుంటారు. మరికొందరు పరుగులు తీస్తారు. నటి అంకిత లోఖండే కూడా ఇదే కోవలోకి వస్తారు. కోవిడ్ టీకా తీసుకునే సమాయంలో బిగ్గరగా అరిచి ఏడ్చినంత పనిచేశారు. ఇందుకు సంబందించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు.

Corona Vaccine

Corona Vaccine: ఇంజక్షన్ అంటే చాలామంది భయపడుతుంటారు. పిల్లలే కాదు.. పెద్దవారిలో కూడా ఈ భయం కనిపిస్తుంది. కొందరైతే కేకలు వేస్తుంటారు. మరికొందరు పరుగులు తీస్తారు. నటి అంకిత లోఖండే కూడా ఇదే కోవలోకి వస్తారు. కోవిడ్ టీకా తీసుకునే సమయంలో బిగ్గరగా అరిచి ఏడ్చినంత పనిచేశారు. ఇందుకు సంబందించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వ్యాక్సిన్ వేసే సమయంలో అంకిత బిగ్గరగా అరిచారు. నెమ్మదిగా వేయాలంటూ నర్స్ ని బ్రతిమాలారు.

ఇక వ్యాక్సినేషన్ అనంతరం ఆమె ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను.. ఇక మీ వంతు” అనే క్యాప్ష‌న్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో అంకిత‌కు న‌ర్స్ వ్యాక్సిన్ వేయ‌డానికి వ‌స్తుంది. టీకా తీసుకునే స‌మయంలో అంకిత చాలా భ‌య‌ప‌డుతుంది. ప్లీజ్ నెమ్మ‌దిగా వేయండి అని న‌ర్స్‌ని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక ఈ వీడియో చూసిన వారు తెగ నవ్వుకుంటున్నారు.

ఈ వీడియో కొద్దీ నిమిషాల్లోనే వైరల్ గా మారింది. అంకిత స్నేహితులు, అభిమానులు చాలా ముద్దుగా ఉన్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. వ్యాక్సిన్ కొరత ఉండటంతో తక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ ఇస్తున్నారు.