టీవీ నటి అంకితా లోఖండే నివసిస్తున్నఅపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది..
కరోనా రక్కసి కోరలు చాపుతోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ముంబైలో టీవీ నటి అంకితా లోఖండే నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అపార్ట్‌మెంట్ మొత్తానికి సీల్ వేశారు.
ఈ అపార్ట్‌మెంట్‌లో అషితా ధావన్, నటాషా శర్మ, మిష్కట్ వర్మ తదితర ప్రముఖులు ఇక్కడ నివసిస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వ్యక్తి ఇటీవల స్పెయిన్ నుండి ఇండియాకి వచ్చాడు. విమానాశ్రయంలో అతనికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది.
అయితే తరువాత అతనిలో కరోనా లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌లో సీల్ చేశారు. ఎవరూ బయటకు రాకుండా ఉండటానికి అపార్ట్‌మెంట్ వెలుపల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనతో అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.