Raja The Raja : ఒకే సినిమాకు దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన బ్రదర్స్.. ‘రాజా ది రాజా’

రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా తెరకెక్కిన రాజా ది రాజా సినిమా జూలై 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. (Raja The Raja)

  • Published on- July 15, 2026 / 07:33 PM IST

Raja The Raja Movie

Raja The Raja : సినీ పరిశ్రమలో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తాజాగా ఇద్దరు బ్రదర్స్ ఒకే సినిమాకు దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా తెరకెక్కిన రాజా ది రాజా సినిమా జూలై 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె.నిహారిక దాసరి నిర్మాణంలో అనిల్ బోయిదాపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు రవికిరణ్ బోయిదాపు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు.

ఇటీవల జరిగిన ప్రమోషన్స్ లో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సాయికుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు అనిల్ బోయిదాపు, సినిమాటోగ్రాఫర్ రవికిరణ్ బోయిదాపులు కృష్ణార్జునులుగా ఈ సినిమాకు పనిచేసారు. వీరిద్దరి మధ్య సమన్వయం అద్భుతమైన విజువల్స్‌ను అందించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అనిల్ దర్శకత్వం, రవికిరణ్ ఫ్రేమింగ్ కృష్ణార్జునుల్లా ఒక్కటిగా పనిచేస్తాయి. ఈ సమన్వయం వల్లే ఫాంటసీ, పీరియడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే లావిష్ విజువల్స్ వచ్చాయి. నాచురల్ లైటింగ్, వైడ్ ఫ్రేమ్స్‌తో కాలేజ్ సన్నివేశాలు, అందమైన నేపథ్యాలను చక్కగా షూట్ చేసారు అని తెలిపారు.

Also See : Epic Movie : లండన్ లో ‘ఎపిక్’ ప్రమోషన్స్.. సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య..

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అనిల్ బోయిదాపు గతంలో అనేక సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి ఈ సినిమాతోనే దర్శకుడిగా మారారు. రవికిరణ్ బోయిదాపు గతంలో అనేది టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్ లో, సెకండ్ యూనిట్ కెమెరామెన్ గా పనిచేసి ఈ సినిమాతోనే పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్ గా మారారు. ఇద్దరు బ్రదర్స్ కలిసి సాంకేతికంగా ఎలాంటి సినిమాని సృష్టించారో చూడాలి.