Annu Kapoor sensational comments on kissing Priyanka Chopra
Annu Kapoor : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సాత్ ఖూన్ మాఫ్ సినిమాలో అన్నూ కపూర్ తన ఐదవ భర్తగా నటించారు. ఈ చిత్రంలో ప్రియాంకకి ఏడుగురు భర్తలుంటారు. అందులో ఒక్కొక్కరినీ చంపే భార్య పాత్రలో ప్రియాంక నటిస్తుంది. 2011లో విడుదలైన ఈ సినిమా షూటింగ్ లో జరిగిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు అన్నూ కపూర్.
ఆయన ఈ సినిమా షూటింగ్ గురించి ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. ఈ మూవీలో మా ఇద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కానీ ఆ సీన్స్ చెయ్యడానికి ప్రియాంక చాలా ఆలోచించారు. ఆ సమయంలో డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ నా దగ్గరికి వచ్చి ప్రియాంక మీతో కిస్సింగ్ సీన్స్ చెయ్యడానికి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారట, ఆ సీన్స్ మార్చాలి అని అన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. చివరికి ఎలాగో అలా ఆ సీన్స్ చేసాం అని అన్నూ కపూర్ అన్నారు.
Also Read : Divyabharathi : బాబోయ్.. బ్లాక్ డ్రెస్‌లో దివ్యభారతి హాట్ పోజులు..
అదే నేను మెయిన్ హీరోగా నటించి ఉంటే తనకి ఎటువంటి ఇబ్బంది ఉండకపోయేది, కానీ నాకు మంచి బాడీ, పర్సనాలిటీ లేదు కాబట్టే ప్రియాంక నాతో ముద్దు సీన్ చెయ్యనని చెప్పింది. అదే నా స్థానంలో వేరే యంగ్ హీరోస్ ఉండుంటే కచ్చితంగా చేసేవారు అంటూ తెలిపారు. దీంతో ప్రస్తుతం అన్నూ కపూర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.