×
Ad

Shhyamali De: నిద్ర లేని రాత్రులు గడుపుతున్న.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ మొదటిభార్య మరో షాకింగ్ పోస్ట్

రాజ్ మాజీ భార్య శ్యామాలి దే(Shhyamali De) ఈ పెళ్లిపై ఇప్పటికే సంచలన కామెంట్స్ చేసింది. తెగ్గించిన వాళ్ళు ఇలాగే చేస్తారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Another shocking post from Raj first wife Shhyamali De on his marriage with Samantha

Shhyamali De: స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న దర్శకుడు రాజ్ నిడిమోరు-సమంత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి అవడం విశేషం. దీంతో, రాజ్ మాజీ భార్య శ్యామాలి దే(Shhyamali De) ఈ పెళ్లిపై ఇప్పటికే సంచలన కామెంట్స్ చేసింది. తెగ్గించిన వాళ్ళు ఇలాగే చేస్తారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ కాస్త సంచలనంగా మారింది. చాలా మంది నెటిజన్స్ కూడా ఆమెకు ఈ విషయంలో సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది శ్యామాలి దే.

Chiranjeevi-Venkatesh: కల నెరవేరింది.. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది.. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం..

“నాకు సపోర్ట్ గా నిలుస్తున్నవారికి నా కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు నాకు అందుతున్నాయి. కానీ, ప్రస్తుతం నేను నాకు అనవసరమైన విషయాల గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేను. మా గురువు క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆయన గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. కాబట్టి, మీ అందరికీ స్పందించడం కుదరడం లేదు. నా బాధను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అలాగే, నాకు పీఆర్‌ టీమ్‌ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ ని నేను హ్యాండిల్ చేసుకుంటాను. కాబట్టి, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే, మీడియా వారికి చెప్పేది ఏంటంటే.. నా నుండి బ్రేకింగ్‌ న్యూస్‌లు ఆశించకండి. మీరు నాపై సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండలని కోరుకుంటాను” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన ఈ రెండో పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. చాలా మంది ఆమెకు సపోర్ట్ గా మెసేజెస్ చేస్తున్నారు.

Another shocking post from Raj first wife Shhyamali De on his marriage with Samantha (1)