Chiranjeevi-Venkatesh: కల నెరవేరింది.. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది.. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం..

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఉన్న మరో విశేషం ఏంటంటే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(Chiranjeevi-Venkatesh) ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడు. అంతేకాదు, చిరంజీవి-వెంకటేష్ మధ్య ఒక యాక్షన్ ఎపిసోడ్, ఒక మాస్ సాంగ్ కూడా ఉండబోతుందట.

Chiranjeevi-Venkatesh: కల నెరవేరింది.. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది.. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం..

Hero Venkatesh expresses happiness over acting with Megastar Chiranjeevi

Updated On : December 3, 2025 / 8:19 PM IST

Chiranjeevi-Venkatesh: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పక్కా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మీసాల పిల్ల సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ పాటలో మెగాస్టార్ గ్రేస్ఫుల్ స్టెప్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబందించిన రీల్స్ కనిపించాయి.

Bigg Boss 9: మారుతున్న లెక్కలు.. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 3 వీళ్ళే.. విన్నర్ విషయంలో క్లారిటీగా ఉన్న ఆడియన్స్..

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఉన్న మరో విశేషం ఏంటంటే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడు. అంతేకాదు, చిరంజీవి-వెంకటేష్(Chiranjeevi-Venkatesh) మధ్య ఒక యాక్షన్ ఎపిసోడ్, ఒక మాస్ సాంగ్ కూడా ఉండబోతుందట. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్ తెరకెక్కించిన అనిల్ తాజాగా సాంగ్ షూట్ ను కూడా కంప్లీట్ చేశాడు. ఇదే విషయాన్ని వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

“చిరంజీవితో కలిసి నటించాలని చాలా ఏళ్ళ నుంచి అనుకున్నాను. ఇన్నాళ్లకు అది సాధ్యమైంది. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. మనమందరం థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం” అంటూ రాసుకొచ్చాడు. దీంతో హీరో వెంకటేష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఒక్క పోస్ట్ తో అటు మెగాస్టార్, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.