Bigg Boss 9: మారుతున్న లెక్కలు.. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 3 వీళ్ళే.. విన్నర్ విషయంలో క్లారిటీగా ఉన్న ఆడియన్స్..
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9) ముగింపు దశకు చేరుకుంది. ఆట ముందుకు సాగుతున్న కొద్దీ గేమ్ కఠినం అవుతోంది. మరికొన్ని వారాల్లో సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది.
Bigg Boss Telugu Season 9 Top 3 Contestants
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. ఆట ముందుకు సాగుతున్న కొద్దీ గేమ్ కఠినం అవుతోంది. మరికొన్ని వారాల్లో సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. అయితే, ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ లో విన్నర్ ఎవరు అనేది నాలుగు, ఐదు వారాల్లోనే క్లారిటీ వచ్చేది. కానీ. సీజన్ 9(Bigg Boss 9)లో మాత్రం చాలా కఠినంగా మారింది. ఒక్కో వారమ్లో ఒక్కొక్కరు హైలెట్ అవుతున్నారు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినవారు ఇప్పుడు టాప్ పొజిషన్ లోకి వెళ్తున్నారు. స్టార్ కంటెంట్ స్టెంట్ గా వచ్చినవారు లీస్ట్ కి చేరుకుంటున్నారు.
నిజానికి ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి తనూజ విన్నర్ అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికి కూడా ఓటింగ్లో ఆమెనే టాప్ లో ఉంటోంది. ఇమ్మాన్యుయేల్, సుమన్ కి కూడా వోటింగ్ బాగానే పడింది. గత కొన్ని వారాలుగా అనూహ్యంగా కళ్యాణ్ పడాల టాప్ పీజిషన్ లోకి దూసుకువచ్చాడు. తన ఆట, మాట తీరు, సరైన సిచువేషన్లో సరైన స్టాండ్ తీసుకోవడం వంటివి కళ్యాణ్ లో చాలా మందికి నచ్చుతున్న అంశాలుగ చెప్పుకోవచ్చు. ఇక తనూజ విషయానికి వస్తే భరణితో నాన్న అంటూ తిరగడం, ప్రతీ చిన్న విషయానికి ఆర్గ్యూ చేయడం ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తోంది. ఇక ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే, సీజన్ మొదట్లో ఆయనకు ఎలాంటి సపోర్ట్ ఉండే ఇప్పటికే అదే సపోర్ట్ అలాగే కొనసాగుతోంది.
తన మాటలు, నిజాయితీ, కామెడీ టైమింగ్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. అందుకే, ఆయన ఇమ్మాన్యుయేల్ చాలా మందికి నచ్చుతున్నాడు. ప్రస్తుతానికి ఈ ముగ్గురు టాప్ 3 పొజిషల్ లో కొనసాగుతున్నారు. ఇక సీజన్ ప్రారంభంలో సుమన్ విన్నర్ విన్నర్ అంటూ వినిపించిన కామెంట్స్ ఇప్పుడు చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం ఆయన ఐదవ పొజిషన్ లో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. కాబట్టి, ఆడియన్స్ మాత్రం విన్నర్ విషయంలో క్లారిటీగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ ఈ ముగ్గురిలోనే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఫైనల్ విన్నర్ ఎవరు అనేది తెలియాలి అంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.
