Hema: నాగ చైతన్య చేస్తే ఒప్పు.. సమంత చేస్తే తప్పా.. ఆడదానికి డబ్బుందని అంటారా.. సామ్ రెండో పెళ్లిపై నటి హేమ కామెంట్స్

టాలీవుడ్ నటి హేమ(Hema) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గత కోనేళ్ళుగా ఆమె తెలుగు ఆడియన్స్ ను తన నటనతో మెప్పిస్తూ వస్తోంది. తాజాగా ఈ నటి ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది.

Hema: నాగ చైతన్య చేస్తే ఒప్పు.. సమంత చేస్తే తప్పా.. ఆడదానికి డబ్బుందని అంటారా.. సామ్ రెండో పెళ్లిపై నటి హేమ కామెంట్స్

Actress Hema made interesting comments on Samantha second marriage

Updated On : December 3, 2025 / 6:36 PM IST

Hema: టాలీవుడ్ నటి హేమ(Hema) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గత కోనేళ్ళుగా ఆమె తెలుగు ఆడియన్స్ ను తన నటనతో మెప్పిస్తూ వస్తోంది. తాజాగా ఈ నటి ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది. పర్సనల్, ప్రెఫెష్నల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా రెండో పెళ్లి చేసుకున్న సమంత గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంత జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఆమె సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ..

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అఖండ సినిమాకు మరో సీక్వెల్.. “జై అఖండ” గురించి చెప్పేశారు..

చాలా మంది కేవలం సమంత గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎవ్వరు ఇలాంటి కామెంట్స్ చేయలేదు. సమంత రెండో పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. కానీ, ఈ విషయంలో సమంతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధంకావడం లేదు. ఆడదానికి డబ్బుందని టార్గెట్ చేయడం ఏంటి అసలు. అది ఆ అమ్మాయి జీవితం. పెళ్లి చేసుకుంది. దానికి కంగ్రాట్స్ చెప్పల్సింది పోయి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు సమంతకు ఓ తోడు అవసరం. అది ఆరోగ్యం విషయంలో కావచ్చు, మానసికంగా కావచ్చు. సమంత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.

అలాగే, నాగ చైతన్య కూడా మంచి వ్యక్తి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చింది హేమ. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నారు. తాజాగా ఆ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తు పెళ్లితో ఒక్కటయ్యారు. అటు సామ్ కి, ఇటు రాజ్ కి ఇది రెండో వివాహం.