Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అఖండ సినిమాకు మరో సీక్వెల్.. “జై అఖండ” గురించి చెప్పేశారు..

నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడూ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగవ సినిమా అఖండ 2(Akhanda 2). బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అఖండ సినిమాకు మరో సీక్వెల్.. “జై అఖండ” గురించి చెప్పేశారు..

Director Boyapati Srinu is making another sequel to Akhanda movie

Updated On : December 3, 2025 / 6:08 PM IST

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడూ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగవ సినిమా అఖండ 2(Akhanda 2). బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈనేపథ్యంలోనే తాజాగా అఖండ సినిమా గురించి ఆసక్తికరమైన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sadhna Singh: మీరు ఎంతైనా తిట్టుకోండి.. నేను అస్సలు తగ్గను.. సమంత స్టైలిస్ట్ షాకింగ్ కామెంట్స్..

అదేంటంటే, అఖండ సినిమా, ఈ సినిమాలో బాలయ్య చేసిన అఘోర పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్ర ప్రధానంగానే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రేక్షకుల్లో కూడా అఖండ అనే పాత్ర చాలా లోతుగా కనెక్ట్ అయ్యింది. అందుకే, ఆ పాత్రను ఈ రెండు సినిమాలకు మాత్రమే పరిమితం చేయాలనీ అనుకోవడం లేదట దర్శకుడు బోయపాటి శ్రీను. అందుకే, అఖండ సినిమాను ఒక ఫ్రాంచైజ్ లా ముందుకు తీసుకువెళ్లని భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే అఖండ 2 సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి.

ఈ సీక్వెల్ కు జై అఖండ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు. దీనికి సంబంధించి చిన్న హింట్ కూడా ఇచ్చేశాడు బోయపాటి. తాజాగా అఖండ 2కి సంబందించిన అన్ని కార్యక్రాలు పూర్తి అయ్యాయి అంటూ టీం అంతా కలిసి ఒక ఫోటోను విడుదల చేశారు. ఆ ఫోటో వెనుకాల ‘జై అఖండ’ అనే టైటిల్ తెరపై కనిపించింది. దీంతో ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా రానుంది అంటూ చెప్పకనే చెప్పేశాడు బోయపాటి. ఇక మేకర్స్ చెప్పినట్టుగా అఖండ 2 సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఆ పెద్ద ట్విస్ట్ ఇదేనేమో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే, ఈ వార్త ఇప్పటికి రూమర్ గానే ఉంది. దానిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన చేయాలి. లేదా అఖండ 2 విడుదల వరకు ఆగాలి.