Sadhna Singh: మీరు ఎంతైనా తిట్టుకోండి.. నేను అస్సలు తగ్గను.. సమంత స్టైలిస్ట్ షాకింగ్ కామెంట్స్..

స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ స్టైలిస్ట్ సాద్నా సింగ్(Sadhna Singh) ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న వేళా సాద్నా సింగ్ సోషల్ మీడియాలో షాకింగ్ స్టోరీ పెట్టింది.

Sadhna Singh: మీరు ఎంతైనా తిట్టుకోండి.. నేను అస్సలు తగ్గను.. సమంత స్టైలిస్ట్ షాకింగ్ కామెంట్స్..

Stylish Sadhna Singh makes shocking comments saying she is being targeted in Samantha issue

Updated On : December 3, 2025 / 4:50 PM IST

Sadhna Singh: స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ స్టైలిస్ట్ సాద్నా సింగ్(Sadhna Singh) ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న వేళా సాద్నా సింగ్ సోషల్ మీడియాలో షాకింగ్ స్టోరీ పెట్టింది. విలన్ అంటూ సంబోధిస్తూ.. “బాధితురాలిగా విలన్ బాగానే నటించింది” అంటూ రాసుకొచ్చింది. దీంతో, సాద్నా సింగ్ చేసిన ఈ కామెంట్స్ సమంత గురించే అంటూ ఆమెపై పండిపడుతున్నారు సామ్ ఫ్యాన్స్. అంతటితో ఆగకుండా ఆమెకు పర్సనల్ మెసేజెస్ కూడా చేస్తున్నారట. అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నరట.

Siri Hanumanth: హాఫ్ డ్రెస్ లో హొయలుపోతున్న సిరి హనుమంతు.. హాట్ ఫొటోలు

తాజాగా ఈ విషయంపై స్పందించింది స్టైలిస్ట్ సాద్నా సింగ్. ఈ విషయంలో నన్ను తిట్టాలంటే ఇంగ్లీష్, భోజ్‌పురి లేదా హిందీలో మాత్రమే తట్టింది. ఎందుకంటే, నాకు ఆ భాషలు మాత్రమే వచ్చు. వేరేవి అర్థం కావు. కాబట్టి, ఆ భాషలలో మీరు తిట్టే తిట్లు వృధా అవుతాయి” అంటూ రాసుకొచ్చింది. దీంతో స్టైలిస్ట్ సాద్నా సింగ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, స్టైలిస్ట్ సాద్నా సింగ్ చేసిన తాజా కామెంట్స్ తో ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. అదేంటంటే, సమంతపై ఆమె చేసిన కామెంట్స్ కి ఆమె ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవడం లేదని. కాబట్టి, తనకు సమంతకు ఆ విషయంలో ఏవి విభేదాలు వచ్చి ఉండవచ్చని, అందుకే ఆమె సామ్ నుంచి దూరంగా వచ్చి ఉండే అవకాశం కూడా ఉంది.

ఇక సమంత దర్శకుడు రాజ్ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. వీరి రిలేషన్ పై చాలా వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ పెళ్లితో ఒక్కటయ్యారు ఈ జంట. సామ్ కి, రాజ్ కి ఇద్దరికీ ఇది రెండో వివాహం అవడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ షూట్ సమయంలో ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్ళికి దారి తీసింది. ఇక ఈ కొత్త జంటకు చాలా మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.