Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే సుందరానికీ..’’ మరో వారంలో రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాతో నాని తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్లు ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.
Ante Sundaraniki : ట్విట్టర్ వేదికగా కన్నడ ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పిన నాని
కాగా.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తుండగా, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర ఓ క్రిస్టియన్ అమ్మాయిగా ఉండబోతున్నట్లుగా చిత్ర టీజర్, ట్రైలర్లు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఓ బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ అమ్మాయిల మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు చిత్ర యూనిట్.
Ante Sundaraniki: అంటే సుందరానికీ.. పక్కా కామెడీ గురూ!
అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దినట్లుగా సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్‌కు కితాబిచ్చారట. ఇక ఈ సినిమాతో మరోసారి నాని తనదైన మార్క్ వదలడం ఖాయమని వారు చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.
‘U’ for all of U ♥️#AnteSundaranikiOnJune10th pic.twitter.com/AEjlMmAgZz
— Nani (@NameisNani) June 4, 2022