Anubhavinchu Raja Teaser : బంగారం గాడు ఊర్లోని.. ఆడి పుంజు బరిలోని ఉండగా ఇంకోడు గెలవడం కష్టమెహే..!

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ‘అనుభవించు రాజా’ మూవీ టీజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు..

Anubhavinchu Raja

Anubhavinchu Raja: వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్.. శ్రీను గవిరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న చిత్రం.. ‘అనుభవించు రాజా’.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తోంది.

Ariyana Glory : అదిరిందమ్మా అరియానా.. కొత్త కారు.. అందులో షికారు..

గురువారం ఈ సినిమా టీజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. టీజర్ ఫన్నీగా ఆకట్టుకుంటుందంటూ మూవీ టీంకి విషెస్ తెలిపారు చరణ్. ఇక టీజర్ విషయానికొస్తే.. రాజ్ తరుణ్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. గెటప్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశాడు.

కోడి పందాల నేపథ్యంలో విలేజ్‌లో జరిగే కథ అని టీజర్‌ని బట్టి అర్థమవుతుంది. నగేష్ విజువల్స్, గోపి సుందర్ సంగీతం చక్కగా కుదిరాయి. త్వరలో ‘అనుభవించు రాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పోసాని, అజయ్, రవికృష్ణ, సుదర్శన్, అరియానా, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.