Prabhas : ‘ఫౌజీ’ షూట్ నుంచి ప్రభాస్ ఫోటోలు రివీల్ చేసిన బాలీవుడ్ స్టార్.. రెబల్ స్టార్ లుక్ అదిరిందిగా..

తాజాగా నటుడు అనుపమ్ ఖేర్ ఫౌజీ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసారు.

Anupam Kher Shares Photos with Prabhas from Hanu Raghavapudi Movie Prabhas photos goes Viral

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల కల్కి సినిమాతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. సీతారామం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అధికారికంగా టైటిల్ అనౌన్స్ చేయకపోయినా ఫౌజీ అనే టైటిల్ వినిపిస్తుంది.

Also Read : Actor Chinna : ఈ నటుడు మాజీ సీఎం మేనల్లుడు అని తెలుసా? ఈయన నటుడు అయ్యాక సీఎం క్యాబినెట్ అందర్నీ పిలిచి..

ఈ సినిమాలో ఇమాన్వి అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్మీ – లవ్ నేపథ్యలో ఈ కథ సాగనుంది. బాలివుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. తాజాగా నటుడు అనుపమ్ ఖేర్ ఫౌజీ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసారు.

అనుపమ్ ఖేర్ ప్రభాస్ తో పాటు డైరెక్టర్ హను రాఘవపూడి, కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ తో ఫౌజీ సెట్స్ లో దిగిన ఫొటోలో షేర్ చేసి.. నా 544వ సినిమా బాహుబలి ప్రభాస్ తో చేస్తున్నాను. ఈ సినిమాని ట్యాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రి మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నా ఫ్రెండ్ బ్రిలియంట్ కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ దీనికి పనిచేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన కథ. జీవితంలో ఇంకేం కావాలి అని రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Samantha : సమంత లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..

అయితే ఈ ఫొటోల్లో ప్రభాస్ లుక్ మాత్రం అదిరింది. కోట్ వేసుకొని, కళ్ళజోడు పెట్టుకొని, మంచి హెయిర్ స్టైల్ తో, లైట్ గా గడ్డంతో కనపడిన ప్రభాస్ లుక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఫౌజీ సెట్స్ నుంచి వచ్చిన ఈ ఫొటోస్ ని చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.