మనకు పెళ్లై అప్పుడే 34 ఏళ్లు గడిచాయా : అనుపమ్ ఖేర్

  • Publish Date - August 26, 2019 / 08:57 AM IST

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ రోజు (ఆగస్ట్ 26, 2019) తన 34వ పెళ్లి రోజు సందర్భంగా తన భార్య, బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా.. ‘డియరెస్ట్ కిరణ్.. నీకు మన 34వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మన జీవితంలోని చాలా సమయం ఇద్దరం కలిసి గడిపాము. మనం పెళ్లిచేసుకుని అప్పుడే 34 ఏళ్లు గడిచాయా. నాకైతే నిన్ననే మన పెళ్లి అయినట్లు అనిపిస్తోంది. నీతో కలిసి జీవించిన, జీవిస్తున్న ప్రతీ క్షణాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను అంటూ అనుపమ్‌ ఖేర్‌, కిరణ్‌ ఖేర్‌కు విషెస్‌ చెప్పారు. విషెస్ తో పాటుగా  వారి పెళ్లిరోజు జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ ఓ అరుదైన ఫోటోను కూడా షేర్ చేశాడు. 

 వీరిద్దరూ 1985లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనుపమ్‌ తో పెళ్లికి ముందే కిరణ్‌ కు గౌతమ్ బెర్రీ అనే ఒక వ్యక్తితో పెళ్లి అయింది. అయితే వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. కానీ కిరణ్‌ ఖేర్‌కు అనుపమ్‌ తో పరిచయం పెరగడంతో పాటుగా వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. చిన్నగా ఈ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వచ్చింది. దీంతో కిరణ్, గౌతమ్‌ కు విడాకులిచ్చి అనుపమ్ ని పెళ్లి చేసుకుంది.

బాలీవుడ్‌లో అనుపమ్‌ ఖేర్ చాలా హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ‘కుచ్ బీ సక్తా హై’ అనే టాక్‌ షో నిర్వహిస్తున్నారు. అంతేకాదు అనుపమ్ ఖేర్ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో చండీఘడ్ ఎంపీగా ఉన్నారు.