Anupama Parameswaran : హీరోకి బ్రేకప్ చెప్పేసిన అనుపమ.. గొడవ పడి మరీ.. ఫోటోలు డిలీట్ చేసి.. ఆ పోస్ట్ అందుకేనా?
తాజాగా వీరిద్దరూ విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. (Anupama Parameswaran)
- Saketh U
- Published on- July 21, 2026 / 03:22 PM IST
Anupama Parameswaran
Anupama Parameswaran : కొన్ని రోజుల క్రితం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విక్రమ్ తనయుడు, హీరో ధృవ్ విక్రమ్ తో డేటింగ్ చేస్తుందని, ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి బైసన్ అనే తమిళ్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. వీరిద్దరూ బయట పార్టీలో లిప్ కిస్ పెట్టుకున్న ఫోటో లీక్ అవ్వడం, ఓ ఈవెంట్లో అనుపమకి స్టేజిపై ధృవ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పగా అనుపమ సిగ్గుపడటం, ఓ ఈవెంట్ లో క్లోజ్ గా సెల్ఫీలు దిగడం, వాటిని ఇద్దరూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఓ ఇంటర్వ్యూలో అర్ధరాత్రి కాల్ చేయాల్సి వస్తే ధృవ్ విక్రమ్ కి చేస్తానని అనుపమ చెప్పడం.. ఇలా పలు సంఘటనలతో వీరు ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయ్యారు.
అయితే తాజాగా వీరిద్దరూ విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో అనుపమ కెరీర్ విషయంలో వేలుపెడుతున్నాడని, పర్సనల్ విషయాల్లో కూడా బాగా జోక్యం చేసుకొని కంట్రోల్ చేస్తున్నాడని, అందుకే అనుపమ అతనితో గొడవ పడి మరీ విడిపోయిందని తమిళ పరిశ్రమ నుంచి వినిపిస్తుంది. తనని కంట్రోల్ చేస్తున్నారు అని ఫీలింగ్ వచ్చి అనుపమ్నే బ్రేకప్ చెప్పిందని సమాచారం.
గత కొన్ని నెలలుగా అనుపమ తన సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. సడెన్ గా నిన్న తన సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేస్తూ.. కొన్నిసార్లు మనశ్శాంతిని పొందాలంటే ఫలితం లేని దారులను వదిలేయాల్సిందే. ఈ రోజు ఆ ప్రశాంతత నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్షణం నుండి నా గొంతుకను నేనే ఎంచుకుంటున్నాను. నా జీవితాన్ని నేనే ఎంచుకుంటున్నాను. ఇకపై ఎవరి అనుమతులు అవసరం లేదు. భయం కూడా లేదు. కేవలం నేను, నన్ను నేను తిరిగి కనుగొంటూ ఒకప్పుడు నాదే అని మర్చిపోయిన ఆ జీవితాన్ని మళ్లీ ప్రేమిస్తున్నాను. అలాగే, చాలా కాలంగా నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఉంది. చాలా కాలం పాటు చెప్పడానికి నాకు అవకాశం లేని విషయం అది. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. నాకు అండగా నిలిచినందుకు, నన్ను నమ్మినందుకు మరియు నా జీవితాన్ని ఎంతో ప్రేమతో నింపినందుకు మీకు ధన్యవాదాలు.
ఒకవేళ ఇంతకుముందు నేను దీన్ని సరిగ్గా చెప్పలేకపోయి ఉంటే నా మనసులో ఆ భావన ఎప్పుడూ ఉండేదని దయచేసి తెలుసుకోండి. నాకు అత్యంత అవసరమైన సమయంలో మీ ప్రతి సందేశం, ప్రతి ప్రార్థన మరియు మీ ప్రతి ప్రేమపూర్వక స్పందన నన్ను చేరాయి. నన్ను తిరిగి నా వైపు నడిపించినందుకు విశ్వానికి ధన్యవాదాలు.
ఇది స్వస్థతకు, స్వేచ్ఛకు స్వాగతం. చివరకు పూర్తిగా ఏ సంకోచమూ లేకుండా నాదైన జీవితానికి స్వాగతం అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తోనే తనను ఇన్ని రోజులు ఎవరో కంట్రోల్ చేసారని, ఇప్పట్నుంచి ఆ కంట్రోల్ ఉండదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో లవ్, రిలేషన్, ఎమోషన్స్ కి సంబంధించిన పలు కొటేషన్స్ ని కూడా పోస్ట్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో గతంలో వేరు పోస్ట్ చేసిన క్లోజ్ సెల్ఫీలను కూడా డిలీట్ చేసారు. దీంతో అనుపమ – ధృవ్ విడిపోయారనే వార్త వైరల్ గా మారింది.
