Chiranjeevi : కిరణ్ అబ్బవరం కోసం వస్తున్న మెగాస్టార్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తాజాగా అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.(Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న కిరణ్ అబ్బవరం జులై 24న చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. సౌత్ మొత్తం తిరుగుతూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తాజాగా అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్, క్లూ ఒకే పదం ‘మెగా’ అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు మూవీ యూనిట్. టాలీవుడ్ సమాచారం ప్రకారం చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా హాజరు కాబోతున్నారని సమాచారం. అందుకే మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు.
Also Read : Nandamuri Balakrishna : షూటింగ్లో ప్రమాదం.. బాలయ్య బాబుకు గాయం.. ఆందోళనలో అభిమానులు!
ఈ చిత్ర నిర్మాతలు SKN, సాయి రాజేష్, ధీరజ్… ముగ్గురూ కూడా చిరంజీవికి వీరాభిమానులే. వీరికి చిరుతో మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు ఎలాగో పాజిటివ్ హైప్ ఉంది. చిరంజీవిని తీసుకొస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని నిర్మాతలు అడగడంతో ఆయన ఒప్పుకున్నారు అని తెలుస్తుంది.
జులై 22 అంటే రేపు బుధవారం నాడు చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా గ్రాండ్ గా జరగనుంది. దీంతో కిరణ్ ఫ్యాన్స్ తో పాటు, మెగా ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

