Anupama Parameswaran : విక్రమ్ తనయుడితో అనుపమ పరమేశ్వరన్.. స్పోర్ట్స్‌ డ్రామాలో అనుపమ..?

అనుపమ పరమేశ్వరన్ తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో జత కట్టనుంది.

Anupama Parameswaran : మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు తమిళ్, తెలుగులో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఈగల్ సినిమాలో కనిపించి మెప్పించింది. త్వరలో టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమాలో ఎప్పుడూ చూడని రేంజ్ లో బోల్డ్ గా నటిస్తుంది. దీంతో టిల్లు స్క్వేర్ సినిమా కోసం అనుపమ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక తమిళ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ తాజాగా కొత్త సినిమాని ప్రకటించింది.

అనుపమ పరమేశ్వరన్ తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) తో జత కట్టనుంది. ధృవ్ తన తండ్రితో కలిసి మహాన్ సినిమాలో నటించిన తర్వాత ఇప్పటివరకు ఇంకా ఏ ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇప్పుడు ధృవ్ విక్రమ్ – అనుపమ పరమేశ్వరన్ కలిసి ఇటీవల మామన్నన్ సినిమాతో హిట్ కొట్టిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Also Read : Ananya Nagalla : ‘తంత్ర’ రిలీజ్ ముందు.. వేణుస్వామిని కలిసిన అనన్య నాగళ్ళ.. ఏం స్పెషల్ పూజలు చేశారో?

అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామాలో మొదటిసారి అనుపమ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాని కేవలం తమిళ్ లోనే రిలీజ్ చేస్తారా? లేక తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు