Ananya Nagalla : ‘తంత్ర’ రిలీజ్ ముందు.. వేణుస్వామిని కలిసిన అనన్య నాగళ్ళ.. ఏం స్పెషల్ పూజలు చేశారో?

తాజాగా అనన్య నాగళ్ళ వేణుస్వామిని కలవడం చర్చగా మారింది.

Ananya Nagalla : ‘తంత్ర’ రిలీజ్ ముందు.. వేణుస్వామిని కలిసిన అనన్య నాగళ్ళ.. ఏం స్పెషల్ పూజలు చేశారో?

Ananya Nagalla Meets Venuswamy before Tantra Movie Release

Updated On : March 12, 2024 / 11:21 AM IST

Ananya Nagalla : నటి అనన్య నాగళ్ళ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూనే పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. త్వరలో అనన్య నాగళ్ళ ‘తంత్ర'(Tantra) అనే హారర్ సినిమాతో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి ప్రేక్షకులని భయపెట్టారు. ఈ సినిమా మార్చ్ 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా అనన్య నాగళ్ళ వేణుస్వామిని కలవడం చర్చగా మారింది. అనన్య నాగళ్ళ వేణుస్వామితో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల వేణు స్వామి పలువురు హీరోయిన్స్ తో పూజలు చేయించి వైరల్ అయిన సంగతి తెలిసిందే. మాములు పూజలు కాకుండా వామాచార పూజలు కూడా వేణుస్వామి చేయిస్తారని ఆయనే చెప్పారు.

Also Read : Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్.. బ్యూటిఫుల్ పెళ్లి సాంగ్..

అనన్య నాగళ్ళ హారర్ సినిమాతో వస్తుంది. ఈ ‘తంత్ర’ సినిమాలో క్షుద్రపూజలు లాంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అనన్య నాగళ్ళ వేణుస్వామిని కలవడంతో ఏమన్నా స్పషల్ పూజలు చేయించారా? సినిమా సక్సెస్ కోసం వేణుస్వామిని కలిసిందా? లేదా సినిమాలో పూజలు లాంటివి వేణుస్వామి ఏమైనా డిజైన్ చేశాడా? అంటూ చర్చగా మారింది. మొత్తానికి వేణుస్వామి దగ్గరికి వెళ్లే హీరోయిన్స్ లిస్ట్ లో అనన్య నాగళ్ళ కూడా చేరడంతో, అది కూడా తంత్ర సినిమా రిలీజ్ ముందే వెళ్లడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది. మరి అనన్య నాగళ్లతో వేణుస్వామి ఏమైనా స్పెషల్ పూజలు చేయించాడేమో తెలియాలి.

Ananya Nagalla Meets Venu Swamy before Tantra Movie Release