Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్.. బ్యూటిఫుల్ పెళ్లి సాంగ్..

తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు.

Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్.. బ్యూటిఫుల్ పెళ్లి సాంగ్..

Vijay Devarakonda Mrunal Thakur Family Star Movie Wedding Song Promo Released

Updated On : March 12, 2024 / 10:37 AM IST

Family Star Song :  ‘గీతగోవిందం’ లాంటి 100 కోట్ల హిట్ సినిమా ఇచ్చాక విజయ్ దేవరకొండ – పరుశురామ్ కాంబో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో రాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ఒక సాంగ్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు. విజయ్ దేవరకొండ మాస్ మెయింటైన్ చేస్తూనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Guntur Kaaram : మహేష్ అభిమానులకు పండగే.. గుంటూరు కారం సినిమాలో లేని సాంగ్ త్వరలో రిలీజ్..

తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ అని సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. ఇది వెడ్డింగ్ సాంగ్ లా చిత్రీకరించారు. సినిమాలో విజయ్, మృణాల్ పెళ్ళిలో ఈ పాట వస్తుందని తెలుస్తుంది. ఇక నుంచి బయట వివాహ వేడుకల్లో ఈ సాంగ్ కూడా బాగా వినిపిస్తుంది. ఈ ఫుల్ లిరికల్ సాంగ్ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.