Anupama Parameswaran : అనుపమ అభిమాని ఆవేదన వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ..
అనుపమ అభిమాని ఆవేదన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ..
- gum 95921
- Published On : February 19, 2024 / 11:28 AM IST
Anupama Parameswaran fan worried video about her latest movies
Anupama Parameswaran : మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్.. తన అందాలతో యూత్ ని మెస్మరైజ్ చేస్తుంటారు. కేవలం అందం మాత్రమే కాదు అభినయంతో కూడా ఆకట్టుకుంటుంటారు. తెలుగు అబ్బాయిలకి అయితే అనుపమ బాగా నచ్చేసారు. ప్రేమమ్, అఆ, శతమానంభవతి వంటి సినిమాల్లో అనుపమని చూసి.. పక్కంటి అమ్మాయిలా ఎంత పద్దతిగా ఉందని ఆమె పై మనసు పారేసుకున్నారు.
ఆన్ స్క్రీన్ పై మీదనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే పద్దతిగా కనిపించేవారు. సోషల్ మీడియాలో కూడా ట్రెడిషనల్ లుక్స్ లో మెస్మరైజ్ చేసేవారు. కానీ ఈమధ్య కాలం నుంచి అనుపమ.. అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ గా కనిపిస్తున్నారు. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో లిప్ కిస్ సీన్స్ తో రెచ్చిపోయిన అనుపమ.. రీసెంట్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమా ట్రైలర్ లో కూడా లిప్ లాక్స్ తో రెచ్చిపోవడమే కాకుండా హాట్ అందాలతో కనిపించారు.
Also read : Mahesh Babu : బాబాయ్ పాటకి కూతురు డాన్స్ అదుర్స్.. అక్క వీడియోపై చెల్లి సితార కామెంట్స్..
సినిమాలోనే కాదు ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా హాట్ అందాలతో హీటెక్కిస్తోంది. ఇక ఇవి అన్ని చూసిన ఆమె అభిమానులు తెగ ఫీల్ అయ్యిపోతున్నారు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు, మా హార్ట్ ఎందుకు బ్రేక్ చేస్తున్నావు అనుపమ అంటూ మొన్నటి వరకు కామెంట్స్ చేస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా వీడియో మెసేజ్ తో వచ్చేసారు. ఒక అభిమాని తన బాధని వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేసాడు.
ఆ వీడియోలో అతను ఏం చెప్పుకొచ్చాడంటే.. “నా ఆటో మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి. ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి. ప్రేమమ్, అఆ, శతమానంభవతి సినిమాలు చేసిన మీరు ఇప్పుడు రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ సినిమాలు చేస్తున్నారు. అసలు ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో కాఫీ సీన్ చేసిందే మీరా అని సందేహ పడిన మేము.. ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఒకప్పుడు సావిత్రి గారు, సౌదర్య గారు చేసిన సినిమాలు లాగానే మీరు చేస్తారని అనుకున్నాము. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం మాకేమి నచ్చడం లేదండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
#TilluSquare ట్రైలర్ చూసి గుండె పగిలిన @anupamahere అభిమాని, తన బాధ చెప్పుకున్నాడు. pic.twitter.com/Wnc4yRB1oA
— Actual India (@ActualIndia) February 18, 2024
