Anupama Parameswaran : నా ఏజ్ లో వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కంటుంటే నేనేమో.. అనుపమ ఆసక్తికర పోస్ట్..
అనుపమ సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, వీడియోలు కచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
- Saketh U
- Published On : September 18, 2023 / 11:14 AM IST
Anupama Parameswaran Interesting post on her age People post goes viral
Anupama Parameswaran : ప్రేమమ్(Premam) సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ టాలీవుడ్(Tollywood) లో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి తెలుగు, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అనుపమ. సినిమాల్లో తన క్యూట్ నెస్‌తో, తన రింగురింగుల జుట్టుతో అభిమానులని సంపాదించుకుంది. ఇటీవల ఒక అడుగు ముందుకేసి బోల్డ్ సీన్స్ లో కూడా నటిస్తూ పాపులర్ అయిపోయింది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటుంది.
అనుపమ సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, వీడియోలు కచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో.. నా ఏజ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు కంటున్నారు. కానీ నేను మాత్రం ఇంకా బయటకి వెళ్లాలంటే ఇంట్లో పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అని సరదాగా పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా.. షూటింగ్స్ కోసం దేశాలు దేశాలు తిరిగేస్తున్న అనుపమ బయటకి వెళ్లాలంటే ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలా అని ఆశ్చర్యపోతున్నారు.
Vinayakan : రజినీకాంత్ పై జైలర్ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ సెట్స్‌లోకి వచ్చి..
అనుపమ ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టిందో తెలీదు కానీ పోస్ట్ మాత్రం వైరల్ గా మారింది. ఇక అనుపమ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ లో నటిస్తుంది.
