Anupama Parameswaran : చీరకట్టుతో అనుపమ వేసిన డాన్స్ ఉంది మామా.. అబ్బో అంతే..

అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఫోటోలు, క్రేజీ వీడియోలతో సందడి చేస్తుంటుంది. తాజాగా చీరకట్టుతో డాన్స్ వేసి..

Anupama Parameswaran latest dance video gone viral

Anupama Parameswaran : అందాల భామ అనుపమ పరమేశ్వరన్ కి యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే క్రేజీ క్రేజీ ఫోటోలకు నెటిజెన్స్ ఫిదా అవుతుంటారు. అలాగే అప్పుడప్పుడు చీరలో అందాలు ఒలికిస్తూ కూడా మెస్మరైజ్ చేస్తుంటుంది. ఇక ఇటీవల ఓనమ్ సెలబ్రేషన్ సమయంలో పాట పాడి ఆడియన్స్ ని ఫిదా చేసిన అనుపమ.. ఇప్పుడు డాన్స్ తో అక్కట్టుకుంటుంది. తాజాగా చీరకట్టుతో డాన్స్ వేసి వావ్ అనిపిస్తుంది.

Chris Evans : సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న కెప్టెన్ అమెరికా.. ఐరన్ మ్యాన్ అతిథిగా..

ప్లేయిన్ బ్లూ శారీలో నడుము అందాలు చూపిస్తూ.. అనుపమ వేసిన సింపుల్ స్టెప్స్ ప్రతి ఒక్కర్ని మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో అనుపమ డాన్స్ కి లైక్స్ తో సమాధానం ఇస్తూ వస్తున్నారు. మరి ఆ వీడియోని మీరు కూడా ఒకసారి చూసేయండి.

Swathi Reddy : చాలా రోజుల తర్వాత కనిపించిన కలర్స్ స్వాతి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి..

కాగా అనుపమ ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో నటిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్‌పోన్ చేసుకున్నారు. కొత్త డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ చిత్రంతో పాటు రవితేజ ‘ఈగిల్’ సినిమాలో కూడా అనుపమ నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే తమిళ్, మలయాళంలో కూడా ఒక్కో సినిమా చేస్తుంది.