Tillu Square : టిల్లు స్క్వేర్ నుంచి అనుపమ లుక్ రిలీజ్..
గత ఏడాది ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మూవీ డీజే టిల్లు. యూత్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకున్న ఈ మూవీకి సీక్వెల్ తెచ్చేందుకు మేకర్స్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు అని పెద్ద చర్చే జరిగింది. చివరికి ఆ రోల్ ని అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. తాజాగా...
- gum 95921
- Published On : February 18, 2023 / 02:43 PM IST
Tillu Square
Tillu Square : గత ఏడాది ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మూవీ డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అందర్నీ అలరించింది. ఇక హీరో సిద్దు స్లాంగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ మూవీకే హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రానికి సిద్దు జొన్నలగడ్డనే కథని అందించాడు. యూత్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకున్న ఈ మూవీకి సీక్వెల్ తెచ్చేందుకు మేకర్స్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే టిల్లు స్క్వేర్ మూవీ అనౌన్స్ చేసి కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.
DJ Tillu: బాలీవుడ్‌లో డీజే కొడుతున్న టిల్లు.. నిజమేనా..?
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు అని పెద్ద చర్చే జరిగింది. చివరికి ఆ రోల్ ని అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది అని మూవీ టీం అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వచ్చాయి. అవేవి నిజం కావంటూ తెలియజేస్తూ ఇటీవల టిల్లు స్క్వేర్ సెట్ లో అనుపమ ఉన్న వీడియోని రిలీజ్ చేశారు. తాజాగా నేడు (ఫిబ్రవరి 18) అనుపమ బర్త్ డే కావడంతో, చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని ఆమె లుక్ ని రిలీజ్ చేశారు.
ఈ లుక్ లో అనుపమ ముక్కు పుడుక పెట్టుకొని, గుండె మీద సంగీత టాటూ వేసుకొని కనబడుతుంది. ఈ ఫొటోతో అనుపమానే టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ అని మరోసారి కన్‌ఫార్మ్ చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నాడు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో ఎంటర్‌టైన్ చేయనుందో చూడాలి.
Wishing the very gorgeous, our @anupamahere a very happy birthday.? – team #TilluSquare #HBDAnupamaParameswaran ✨#Siddu @MallikRam99 @ram_miriyala @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/kCjtLPegij
— Sithara Entertainments (@SitharaEnts) February 18, 2023
