Anupama Parameswaran : తనతో షార్ట్ ఫిలిం చేసిన డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన అనుపమ.. పుట్టిన రోజు నాడు ప్రకటన..
నేడు అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త సినిమాని ప్రకటించారు.(Anupama Parameswaran)
- Saketh U
- Published On : February 18, 2026 / 05:58 PM IST
Anupama Parameswaran
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో అనుపమ సినిమాలు చేస్తుంది. తాజాగా అనుపమ మెయిన్ లీడ్ గా పాన్ ఇండియా సినిమా ప్రకటించారు. నేడు అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త సినిమాని ప్రకటించారు.(Anupama Parameswaran)
ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్, బెంచ్‌మార్క్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్స్ పై శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాణంలో ఆర్జే షాన్ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ గా కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమా ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. మేలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతామని, త్వరలోనే టైటిల్ ప్రకటిస్తామని మూవీ యూనిట్ తెలిపారు.
Also Read : Harish Uthaman : OG వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నటుడు.. పవర్ స్టార్ తో హరీష్ ఉత్తమన్..
గతంలో అనుపమ – షాన్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే షార్ట్ ఫిల్మ్ సంచలనం సృష్టించింది. తనతో షార్ట్ ఫిలిం తీసిన దర్శకుడికి ఇప్పుడు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చింది అనుపమ. దీంతో ఈ కాంబో పై అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ ఎస్కేజీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇప్పుడు సౌత్ లో కూడా సినిమాలు చేస్తుంది. నిర్మాత ప్రేరణ అరోరా గతంలో రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి.. లాంటి పలు సినిమాలు తీయగా ఇటీవల తెలుగు, హిందీలో సుధీర్ బాబుతో జటాధర అనే సినిమాని నిర్మించింది. ఇప్పుడు అనుపమతో ఈ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ కొత్త సినిమాతో అనుపమ ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Vishnu Vinyasam : ‘విష్ణు విన్యాసం’ టీజర్ వచ్చేసింది.. శ్రీ విష్ణు మళ్ళీ కామెడీతో వచ్చేస్తున్నాడు..
