×
Ad

Anupama Parameswaran : సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమా చూశారా?

తాజాగా అనుపమ పరమేశ్వరన్ కెమెరావుమెన్ గా మారింది. సినిమాటోగ్రాఫర్ గా మారి ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కించింది. సంకల్ప్ గోరా అనే ఓ యువకుడి దర్శకత్వంలో వచ్చిన 'ఐ మిస్ యు' అనే షార్ట్ ఫిల్మ్‌కి అనుపమ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసింది.

  • Published On : April 11, 2023 / 06:35 AM IST

Anupama Parameswaran Turned as Cinematographer for a short film

Anupama Parameswaran :  మలయాళంలో(Malayalam) ప్రేమమ్(Premam) సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తెలుగులో అ ఆ(A Aa) సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం తెలుగు(Telugu), మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనుపమ. సినిమాల్లో నటనతో పాటు తన క్యూట్ లుక్స్ తో, కర్లీ హెయిర్ తో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ బోలెడంత మంది అభిమానులని సంపాదించుకుంది. గతంలో అనుపమ(Anupama) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్యత్తులో దర్శకత్వం(Direction) చేస్తానని కూడా తెలిపింది.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ కెమెరావుమెన్ గా మారింది. సినిమాటోగ్రాఫర్ గా మారి ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కించింది. సంకల్ప్ గోరా అనే ఓ యువకుడి దర్శకత్వంలో వచ్చిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌కి అనుపమ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చాయ్ బిస్కెట్ లో చూడొచ్చు. అమెరికాలో నివసిస్తున్న ఒక యువకుడు, అతని తల్లిదండ్రుల మధ్య ఉన్న ఎమోషనల్ బంధం, వాళ్ళు అతన్ని ఎలా మిస్ అవుతున్నారు అనే ఎమోషనల్ కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిలింని తెరకెక్కించారు.

Kisi Ka Bhai Kisi Ki Jaan : సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకి జాన్ ట్రైలర్ చూశారా??

ఈ సినిమాని నిజంగానే అమెరికా, ఇండియాలో ఉన్న వాళ్ళ మధ్య తెరకెక్కించారు. దీంతో ఎమోషనల్ గా మెప్పిస్తుంది అని ఈ షార్ట్ ఫిలింకి మంచి పేరు వస్తుంది. ఇండియాలో జరిగిన షూటింగ్ పార్ట్ కి అనుపమ పరమేశ్వరన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసింది. దీంతో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఓ హీరోయిన్ ఇంత అద్భుతంగా, అది కూడా ఓ షార్ట్ ఫిలింకి కెమెరా వర్క్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతూ అనుపమను అభినందిస్తున్నారు.