Kisi Ka Bhai Kisi Ki Jaan : సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకి జాన్ ట్రైలర్ చూశారా??

తాజాగా సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న కిసీకా భాయ్ కిసీకి జాన్ ట్రైలర్ ను విడుదల చేశారు.

Kisi Ka Bhai Kisi Ki Jaan : సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకి జాన్ ట్రైలర్ చూశారా??

Salman Khan Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer Released

Updated On : April 10, 2023 / 6:42 PM IST

Kisi Ka Bhai Kisi Ki Jaan : సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా, నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా కిసీకా భాయ్ కిసీకి జాన్. పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్(Venkatesh) ఓ ముఖ్య పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాలోని ఓ పాటలో రామ్ చరణ్(Ram Charan) కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసి సల్మాన్ ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజయ్యాయి. ఇందులో బతుకమ్మ(Bathukamma) సాంగ్ కూడా ఉండటం విశేషం.

తమిళ్ వీరమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది కిసీకా భాయ్ కిసీకి జాన్. తాజాగా కిసీకా భాయ్ కిసీకి జాన్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతుంది.