Anurag Kashyap : బాలీవుడ్ మారట్లేదు.. నేను సౌత్ కి వెళ్ళిపోతాను స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇక బాలీవుడ్ ని వదిలేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేసాడు అనురాగ్ కశ్యప్.

Anurag Kashyap Sensational Comments on Bollywood and wants to leave Mumbai

Anurag Kashyap : ఆర్జీవీ శిష్యుడిగా కెరీర్ మొదలుపెట్టిన అనురాగ్ కశ్యప్ దర్శకుడిగా అనేక హిట్ సినిమాలు ఇచ్చి బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారారు. దర్శకుడిగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా, నటుడిగా కూడా బిజీ అయ్యాడు. ఇతని సినిమాలు బాలీవుడ్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇక బాలీవుడ్ ని వదిలేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేసాడు అనురాగ్ కశ్యప్.

Also See : Balakrishna – Ram Charan : అన్‌స్టాప‌బుల్‌ షూట్ లో బాలయ్యతో చరణ్ – శర్వానంద్ సందడి.. ఫోటోలు చూశారా?

అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. నేను ఇప్పుడు ప్రయోగాలు చేయలేను. ఇప్పుడు నిర్మాతలు ప్రాఫిట్స్ కోసమే చూస్తున్నారు. ఫిలిం మేకింగ్ లోని ఆనందాన్ని వదిలేసారు. నేను అందుకే నెక్స్ట్ ఇయర్ ముంబై నుంచి సౌత్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎక్కడైతే ఇన్ స్పైరింగ్ వర్క్ ఉంటుందో అక్కడికి వెళ్తాను లేదా ఇలాగే ముసలివాడినయి చచ్చిపోతాను. ఈ బాలీవుడ్ నన్ను చాలా నిరుత్సాహపరుస్తుంది అని అన్నారు.

అలాగే.. మంజుమల్ బాయ్స్ సినిమాని బాలీవుడ్ లో చూడరు. కానీ వాళ్ళు దాన్ని రీమేక్ చేయాలనుకుంటారు. వాళ్ళు ఏది కొత్తగా చేయడానికి ప్రయత్నించట్లేదు. క్రియేటివ్ గా చేయడానికి రిస్క్ తీసుకోవట్లేదు. కొంతమంది యాక్టర్స్ నటించడానికంటే కూడా స్టార్స్ అవ్వడానికి చూస్తారు అని వ్యాఖ్యలు చేసాడు అనురాగ్ కశ్యప్. దీంతో ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Nagavamsi – Boney Kapoor : బోనీకపూర్ వర్సెస్ నాగవంశీ.. బాలీవుడ్ సినిమా ఇంకా అక్కడే ఉంది.. ఫుల్ కౌంటర్లు వేసిన నిర్మాత..

ఆల్రెడీ అనురాగ్ కశ్యప్ సౌత్ లో తమిళ్, మలయాళం సినిమాల్లో నటించాడు. ఇప్పుడు పూర్తిగా ఫోకస్ పెడితే అనురాగ్ కి నటుడిగా చాలా ఛాన్సులు వస్తాయి. మరి సౌత్ కి వచ్చి నటుడిగా బిజీ అవుతాడా లేక దర్శకుడు అవుతాడా చూడాలి. అనురాగ్ చివరగా కెన్నడీ అనే సినిమాను డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా అనేక అవార్డులను సాధించింది. ఇక నటుడిగా ఇటీవలే తమిళ్ సినిమా విడుదల 2 లో కనిపించాడు.