Anushka Shetty : అనుష్క ఘాటి ఫస్ట్ లుక్ రిలీజ్.. మరో కొత్త అవతారంలో స్వీటీ..

Anushka Ghaati first look release

Anushka Shetty : నటి అనుష్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసి బిజీ అయ్యింది. నిజానికి బాహుబలి సినిమా తర్వాత అనుష్క వరుస సినిమాలు చేస్తుందని అనుకున్నారు కానీ అడపా దడపా సినిమాల్లో మాత్రమే కనిపించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు కొత్త ఐ ఫోన్ కొన్నాడా??

గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇటీవల కొత్త సినిమా అనౌన్స్ చేసింది అనుష్క. ఘాటీ అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. అయితే తాజాగా నేడు నవంబర్ 7న అనుష్క పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుండి మేకర్స్ అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో అనుష్క రక్తపు ముఖంతో చాలా భయంకరంగా కనిపిస్తుంది. బంగా పొగ త్రాగుతోంది. కన్నీళ్లతో ఉన్న కళ్ళతో చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబందించిన  గ్లింప్స్ సైతం ఈ రోజు 4:05 కి విడుదల చేస్తామని పోస్ట్ లో పేర్కొన్నారు.


ఇక పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఘాటీ సినిమా పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా చేస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది.