Anushka Sharma : ‘చక్ దే ఎక్స్‌ప్రెస్’ షూటింగ్ కంప్లీట్.. ఇండియన్ క్రికెటర్‌గా అనుష్క..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ వెంటనే పాపకి జన్మనిచ్చి అమ్మ అవ్వడంతో.. గత నాలుగేళ్లుగా ఆమె కెమెరా ముందుకు రాలేదు. చివరిగా 2018లో విడుదలైన షారుఖ్ ఖాన్ 'జీరో' సినిమాలో కనిపించిన అనుష్క, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. అందుకోసం స్టార్ ఇండియన్ క్రికెటర్ బయోపిక్‌ని ఎంచుకుంది.

Anushka Sharma : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ వెంటనే పాపకి జన్మనిచ్చి అమ్మ అవ్వడంతో.. గత నాలుగేళ్లుగా ఆమె కెమెరా ముందుకు రాలేదు. చివరిగా 2018లో విడుదలైన షారుఖ్ ఖాన్ ‘జీరో’ సినిమాలో కనిపించిన అనుష్క, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. అందుకోసం స్టార్ ఇండియన్ క్రికెటర్ బయోపిక్‌ని ఎంచుకుంది.

Anushka Sharma : వింటేజ్ లుక్స్‌లో అదరగొడుతున్న అనుష్క..

అయితే అంతకంటే ముందే అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ.. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన ‘ఖలా’ అనే ఒక సినిమాలో అతిధి పాత్రలో కనిపించింది. ఇప్పుడు పూర్తి స్థాయి పాత్రతో ఒక సినిమాలో నటిస్తుంది. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌లో స్టార్ బౌలర్‌గా పేరుని సంపాదించుకున్న ‘ఝులన్ గోస్వామి’ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. గోస్వామి పాత్రలో అనుష్క శర్మ కనిపించబోతుంది.

‘చక్ దే ఎక్స్‌ప్రెస్’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని రోజులుగా జరుగుతుండగా, నిన్న గుమ్మడికాయ కొట్టారు. నిన్న ఫైనల్ డే షూట్ అయిన తరువాత కేక్ ని కట్ చేశారు మూవీ టీమ్. అందుకు సంబంధించిన ఫోటోలను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో గోస్వామి కూడా ఉంది. అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించిన గోస్వామి పాత్రలో అనుష్క ఎంతవరకు ఆకట్టుకోగలదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు