ప్రణయ్ రాయ్ & అసోసియేట్స్‌కు చెందిన లాయర్స్ వీరేన్ శ్రీ గురుంగ్ కొవిడ్-19 సంక్షోభం సమయంలో ఫ్రీగా లీగల్ అడ్వైజ్ ఇచ్చేందుకు గిల్డ్ లా ఏర్పాటు అయ్యారు. పాతాల్ లోక్ కో-ప్రొడ్యూసర్ అయిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు వీరి నుంచి లీగల్ నోటీసులు అందాయి. మే18న టెలికాస్ట్ అయిన షోలో ఓ కులాన్ని ప్రస్తావిస్తూ దూషణ జరిగిందని ఆరోపణ.
సెకండ్ ఎపిసోడ్ లో నేపాలీ కమ్యూనిటీ మొత్తాన్ని అవమానిస్తున్నట్లుగా ఉందని.. గురుంగ్ ఆరోపిస్తున్నారు. ‘లేడీ పోలీస్ ఆఫీసర్ విచారణ జరుపుతున్న సమయంలో నేపాలీ క్యారెక్టర్ ను కమ్యూనిటీ మొత్తాన్ని దూషించేలా ఓ పదం వాడుతుంది. అందులో తప్పేం లేకపోయినా అక్కడ నేపాలీ అనే పదాన్ని కూడా కలుపుతుంది. అది ఒప్పుకోదగినది కాదు.
అనుష్క శర్మ కూడా నిర్మాతల్లో ఒకరు కావడంతో ఆమెకు నోటీసులు పంపాం. ఇంకా అనుష్క నుంచి రెస్పాన్స్ రాలేదు. అమెజాన్ ఓటీటీ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రోగ్రాంపై విచారణకు లీగల్ టీం మరికొంచెం ముందుకు వెళ్లనుంది.
పాతాల్ లోక్ లో దూషణ జరిగిందని గోర్ఖా కమ్యూనిటీ గట్టి వ్యతిరేకత వ్యక్తపరుస్తోంది. ఆ పదాన్ని తొలగించాలని కోరుతుంది. సోమవారం యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీకు ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రకాశ్ జవదేవకర్ అమెజాన్ ప్రైమ్ వీడియో, సిరీస్ ప్రొడ్యూసర్ అయిన అనుష్క శర్మ నేపాలీ మహిళలను కించపరిచే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.