Anushka Shetty : ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తర్వాత అక్కడ ఎంట్రీ ఇస్తున్న అనుష్క.. సన్నబడింది సినిమా కోసమేనా?
ప్రస్తుతం అనుష్క శెట్టి మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క.

Anushka Shetty Entry into Malayalam Movies after 19 Years Recent Looks goes Viral
Anushka Shetty : అనుష్క శెట్టి.. ఓ రెండు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొట్టింది. బోలెడంతమంది అభిమానులను సంపాదించుకున్న అనుష్క భాగమతి సినిమా తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయింది.
2018 నుంచి కేవలం మూడు సినిమాల్లోనే కనిపించింది. అందులో ఒకటి జస్ట్ గెస్ట్ అప్పీరెన్స్. గత సంవత్సరం సెప్టెంబర్ లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో చాన్నాళ్ల తర్వాత అనుష్క తెలుగు ప్రేక్షకుల ముందుకి రావడంతో అభిమానులు, ప్రేక్షకులు సంతోషించారు. ఇకనుంచైనా అనుష్క రెగ్యులర్ గా సినిమాలు చేస్తుందా అని సందేహం కూడా వ్యక్తపరిచారు.
Ananya Nagalla : ‘తంత్ర’ రిలీజ్ ముందు.. వేణుస్వామిని కలిసిన అనన్య నాగళ్ళ.. ఏం స్పెషల్ పూజలు చేశారో?
ప్రస్తుతం అనుష్క శెట్టి మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క. ‘కథానర్’ అనే సినిమాలో జయసూర్య, అనుష్క శెట్టి మెయిన్ లీడ్స్ లో నటించబోతున్నారు. ఇవాళే ఉదయమే అనుష్క ఆ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో మూవీ యూనిట్ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఫొటోల్లో అనుష్క సన్నబడినట్టు కనిపిస్తుంది. గతంలో సైజు జీరో సినిమా కోసం బాగా లావు అయింది అనుష్క. ఆ తర్వాత బాహుబలి సినిమా సమయంలో మళ్ళీ నాజూగ్గా తయారయింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పుడు కొంచెం బొద్దుగా తయారయిందని కామెంట్స్ వచ్చాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కూడా అనుష్క కొంచెం బొద్దుగా ఉందని కామెంట్స్ చేశారు. ఇప్పుడేమో మళ్ళీ మొదట్లో ఉన్నట్టు సన్నగా మారిపోవడంతో అనుష్క కొత్త లుక్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read : Anupama Parameswaran : విక్రమ్ తనయుడితో అనుపమ పరమేశ్వరన్.. స్పోర్ట్స్ డ్రామాలో అనుపమ..?
మరి అనుష్క మలయాళం మొదటి సినిమా ఎలా ఉంటుందో? తెలుగులో కూడా రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సమయంలో ప్రమోషన్స్ కి కూడా రాలేదు అనుష్క. అసలు బయటకి, మీడియా ముందుకే రాలేదు. మరి ఈ మలయాళం సినిమా ప్రమోషన్స్ కి అయినా వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ తెలుగులో అనుష్క ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
#AnushkaShetty is all set to work in her debut Malayalam film and has joined the sets of #Jayasurya starrer #Kathanar ✨ #MangoMalayalam pic.twitter.com/ze7loMPArE
— Mango Malayalam (@MangoMalayalam) March 12, 2024