Miss Shetty Mr Polishetty : అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటా.. టీజర్ వచ్చేసింది!

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.

Anushka Shetty Miss Shetty Mr Polishetty teaser released

Miss Shetty Mr Polishetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. యువీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.

ఈ మూవీలో అనుష్కా చెఫ్ గా కనిపిస్తుంటే, నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. టీజర్ చూస్తుంటే ఈసారి నవీన్ గట్టిగా నవ్వించేలా ఉన్నాడు.