B3 Movie: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ‘B3’ మూవీ.. ఫిల్మ్ ఛాంబర్ లో లోగో ఆవిష్కరణ
ఫిల్మ్ ఛాంబర్లో బి3 సినిమా(B3 Movie) లోగో ఆవిష్కరణ.
B3 Cinema logo unveiled at Film Chamber
B3 Movie; దర్శకుడు నానిరాజ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ B3. VVS క్రియేషన్ బ్యానర్లో శ్రీరంగం సతీష్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లోగో ఆవిష్కరణ నేడు(ఫిబ్రవరి 27) ఫిల్మ్ ఛాంబర్ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మలప్రసన్న కుమార్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు & తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
The Kerala Story 2: రిలీజ్ కు లైన్ క్లియర్.. కేరళ స్టోరీ-2 సినిమాపై స్టే ఎత్తేసిన హైకోర్టు
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. నానిరాజ్ గత 9 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ గా పని చేశాడు. ఆలాగే, షార్ట్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ B3(B3 Movie) సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో మంచి కామెడీ అండ్ యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే, ఈ సినిమాను ఆయనే మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మార్చి నుంచి జూన్ వరకు జరుగనున్నాయి. అలాగే ఈ సినిమాలో, అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్‌ఘోష్, ,LB శ్రీరామ్, చిత్రమ్ శ్రీను, చత్రపతి శేఖర్, జబర్దాష్ అప్పారావు, షేకింగ్ శేషు, రవి కుమార్, శ్రీకాంత్, హరీష్, రాజు, G నారాయణ రావు, సైనిక, హర్ష వర్దిని, మమత, స్నేహ, జగదీశ్వరి, ధనలక్ష్మి రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. ఇంకా ఈ సినిమాకు సురేష్ ఆత్రేయ డిఓపిగా, శ్రీను ఎడిటర్ గా పని చేస్తున్నారు.

