×
Ad

Pawan Kalyan – Chandrababu : అంబానీతో సహా ప్రముఖులందరికి.. దగ్గరుండి పవన్ కళ్యాణ్‌ని పరిచయం చేసిన చంద్రబాబు..

తాజాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు వెళ్లారు.

  • Published On : July 15, 2024 / 09:54 AM IST

AP CM Chnadrababu Naidu Introduced Pawan Kalyan to National Leaders in Anant Ambani Wedding

Pawan Kalyan – Chandrababu : అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు గత ఐదురోజులుగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల్లోని ప్రముఖులు చాలా మంది ఈ పెళ్ళికి హాజరయి సందడి చేసారు. మెయిన్ పెళ్లి రోజు మాత్రం చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. మన టాలీవుడ్ నుంచి కూడా రామ్ చరణ్, ఉపాసన, వెంకటేష్ ఫ్యామిలీ, అఖిల్, మహేష్ బాబు ఫ్యామిలీ.. ఇలా పలువురు హాజరయ్యారు.

ఏపీ రాజకీయాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వందకు వంద శాతం విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా పవన్ బాగా ఫేమస్ అయ్యారు. దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. మోదీ కూడా పవన్ సునామి లాంటివాడు అనడంతో నార్త్ లో కూడా బాగా పాపులర్ అయ్యాడు పవన్.

Also Read : Sarfira : స్టార్ హీరో సినిమాకు ఎవరూ రాకపోవడంతో.. ఫ్రీగా ఛాయ్, సమోసా ఇస్తాం రండి అంటూ థియేటర్స్ ప్రకటన..

అయితే తాజాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు వెళ్లారు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేషనల్ వైడ్ కూడా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ స్వయంగా వచ్చి చంద్రబాబుని పలకరించారు. అప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ ని కూడా అంబానీకి పరిచయం చేసారు. అలాగే మహారాష్ట్ర సీఎం షిండేకు కూడా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు పరిచయం చేసారు. ఇలా పలువురు దేశ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు దగ్గరుండి పరిచయం చేసారు. ఈ విషయంలో చంద్రబాబుని జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.

పవన్ సినిమాల పరంగా ముందే గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు బాలీవుడ్ నటీనటులు, బాలీవుడ్ మీడియా ప్రముఖులు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి పలకరించి మాట్లాడుతున్నారు. పలువురు పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో పవన్ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.