AP Home Minister Vangalapudi Anitha Launches Mother Song from Friday Movie
Mother Song : దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఫ్రైడే’. శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మాణంలో ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
నిన్న మదర్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి అమ్మ ప్రేమను చాటే పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ప్రజ్వల్ క్రిష్ సంగీత దర్శకత్వంలో మధు కిరణ్ ఈ పాటను రాయగా స్నిగ్ద నయని పాడారు. మీరు కూడా ఈ మెలోడీ అమ్మ సాంగ్ వినేయండి..
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ .. డైరెక్టర్ చెప్పిన కథ నాకు చాలా కనెక్ట్ అయింది. నేను ఎదిగి ప్రయోజకుడ్ని అయ్యే సరికి మా అమ్మ గారు చనిపోయారు. నా ఎదుగుదలను మా అమ్మ చూడలేదు. అమ్మ సెంటిమెంట్ తో ఈశ్వర్ చెప్పిన కథ నా మనసుకు తాకింది అని తెలిపారు. డైరెక్టర్ ఈశ్వర్ బాబు మాట్లాడుతూ.. ఫ్రైడే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. గతంలో నేను గాడ్సే మీద సినిమా తీశాను. ఫ్రైడే సినిమాలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. మా సినిమా చూసిన తరువాత ప్రతీ తల్లి తన కొడుకుని ఓ ఛత్రపతి శివాజీలా, మహారాణా ప్రతాప్ సింగ్‌లా పెంచుతారు అని అన్నారు.
Also See : Ram Charan Wax Statue : రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు చూశారా?
హీరో రోహిత్ మాట్లాడుతూ.. స్నిగ్ద పాడిన అమ్మ పాట నన్ను కదిలించింది. ఈ కథ చెప్పినప్పుడు కాస్త షాక్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నా ప్రతీ అడుగులో మా అమ్మ తోడుగా ఉండేవారు అని చెప్పారు. సింగర్, నటి స్నిగ్ద మాట్లాడుతూ.. ఈ చిత్రంలో అమ్మ పాటను పాడినందుకు ఆనందంగా ఉంది. ఇందులో మంచి పాత్రని కూడా పోషించాను అని అన్నారు. నటి, బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. స్నిగ్ద పాడిన అమ్మ పాటను వింటే నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చారు అని తెలిపింది.
Also See : Ram Charan : లండన్ లో రామ్ చరణ్.. ఫ్యాన్స్ సందడి..