AR Murugadoss
AR Murugadoss : అన్ని సినీ పరిశ్రమలు మా సినిమాలకు ఇన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అని గర్వంగా చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని పరిశ్రమలకు వెయ్యి కోట్లే టార్గెట్. ఏ పెద్ద సినిమా వచ్చినా, పాన్ ఇండియా సినిమా వచ్చినా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందా అనే చర్చే జరుగుతుంది. బాలీవుడ్ వాళ్లకు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయి. మన టాలీవుడ్ లో బాహుబలి, పుష్ప, RRR, కల్కి.. సినిమాలు వెయ్యి కోట్లు సాధించాయి. కన్నడలో కెజిఎఫ్ సినిమా వెయ్యి కోట్లు సాధించింది. తమిళ్ లో ఇప్పటివరకు వెయ్యి కోట్ల సినిమానే లేదు.
తమిళ్ ప్రేక్షకులు, సినిమా పరిశ్రమ వాళ్ళు మాత్రం వెయ్యి కోట్ల కలెక్షన్స్ కోసం కలలు కంటున్నారు. తమిళ్ నుంచి ఏ భారీ సినిమా వచ్చినా, పెద్ద హీరో సినిమా వచ్చినా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అని అంచనాలు వేసుకుంటున్నారు, అవి ఫెయిల్ అవుతున్నాయి. గతంలో పొన్నియన్ సెల్వన్ రెండు పార్టులు, జైలర్, లియో, విక్రమ్.. ఇలా పలు సినిమాలకు వెయ్యి కోట్లు వస్తాయని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మళ్ళీ కూలీ సినిమాకు కూడా వెయ్యి కోట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నా అది కూడా తీరేలా లేదు.
Also Read : Kangana Ranaut : డేటింగ్ యాప్స్, లివ్-ఇన్ కల్చర్ పై కంగనా ఫైర్.. గర్భం వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు?
దీంతో ఈ వెయ్యి కోట్ల కలెక్షన్స్ తమిళనాట చర్చగా మారింది. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ AR మురుగదాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వెయ్యి కోట్ల కలెక్షన్స్ గురించి ప్రశ్న ఎదురవ్వగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మురుగదాస్ మాట్లాడుతూ.. వేరే భాషల దర్శకులు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు అందుకే వాళ్లకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తాయి. మన తమిళ డైరెక్టర్స్ ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేస్తారు అందుకే మనకు రావు. మన సినిమాల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్తాము. తమిళ దర్శకులను వేరే దర్శకులతో పోల్చకూడదు అని అన్నారు.
దీంతో మురుగదాస్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అన్ని సినీ పరిశ్రమల ఫ్యాన్స్, ప్రేక్షకులు, పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు ఏం నేర్పించాయి? అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, తమిళ్ వాళ్ళు మెసేజ్ లు ఇవ్వడానికే సినిమాలు చేస్తున్నారా? స్పైడర్, సికిందర్ లాంటి సినిమాల నుంచి ఆయనేం నేర్పించారు అంటూ విమర్శలు చేస్తున్నారు.
Also Read : sridevi vijaykumar : ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. శ్రీదేవి వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఫొటోలు..